4. Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన విషయంలోనూ కొన్ని మినహాయింపులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2020 మార్చి 25 నుంచి 2020 జూన్ 30 వరకు లాక్డౌన్ కాలంలో 10 ఏళ్ల వయస్సు దాటిన అమ్మాయిల పేరుమీద సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. మామూలుగా అయితే 10 ఏళ్ల లోపే ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి. కానీ లాక్డౌన్ సమయంలో 10 ఏళ్లు దాటినవారికి అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం లేకుండా పోయింది. అందుకే వారికి 2020 జూలై 31 వరకు అవకాశం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)