మార్కెట్లో రెండు శాతం కంటే ఎక్కువ నష్టం వాటిల్లింది మరియు పెట్టుబడిదారుల మూలధనం రూ. 3 లక్షల కోట్లకు పైగా తగ్గింది. మార్కెట్లో ఈ క్షీణత వెనుక దేశీయంగానే కాకుండా బయటి కారణాలూ ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాశ్చాత్య దేశాలను హెచ్చరించడం మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.(ప్రతీకాత్మక చిత్రం)
ప్రైవేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఇన్వెస్టర్లకు శుభవార్త అందించింది. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డిలపై బ్యాంకు వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు HDFC బ్యాంక్ సాధారణ ప్రజలకు 3% నుండి 7.10% వరకు మరియు సీనియర్ సిటిజన్లకు 3.50% నుండి 7.60% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 21, 2023 నుండి అమలులోకి వచ్చాయి.(ప్రతీకాత్మక చిత్రం)