1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. వృద్ధులకు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ 'ఎస్బీఐ వీకేర్' గడువును జూన్ 30 వరకు పొడిగించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. కరోనా వైరస్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధుల కోసం ప్రత్యేకంగా టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను 2020 మేలో ప్రకటించింది బ్యాంకు. మొదట సెప్టెంబర్ వరకు గడువు విధించింది. తర్వాత డిసెంబర్ వరకు ఓసారి, 2021 మార్చి 31 వరకు మరోసారి గడువును పొడిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ గడువు ముగుస్తుండటంతో మరోసారి మూడు నెలలు గడువు పొడిగించింది. కాబట్టి సీనియర్ సిటిజన్లు 'ఎస్బీఐ వీకేర్' స్కీమ్‌లో డిపాజిట్ చేయడానికి మరో మూడు నెలలు అవకాశం ఉంది. 'ఎస్బీఐ వీకేర్' ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. సాధారణంగా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు వృద్ధులకు వేరుగా ఉంటాయి. సాధారణ వడ్డీ రేట్ల కన్నా వృద్ధులకు 50 బేసిస్ పాయింట్స్ అంటే అర శాతం వడ్డీ ఎక్కువ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతం సాధారణ ప్రజలకు ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్‌పై 5.40 శాతం వడ్డీని ఇస్తోంది ఎస్బీఐ. వృద్ధులకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువ వడ్డీ చెల్లిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లకు 5.90 శాతం వడ్డీ వస్తుంది. ఒకవేళ 'ఎస్బీఐ వీకేర్' స్కీమ్‌లో డిపాజిట్ చేస్తే అదనంగా 30 బేసిస్ పాయింట్స్ వడ్డీ లభిస్తుంది. అంటే 'ఎస్బీఐ వీకేర్' స్కీమ్‌లో డిపాజిట్ ద్వారా సీనియర్ సిటిజన్లు 6.20 శాతం వడ్డీ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. అది కూడా 2021 జూన్ 30 లోగా ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వడ్డీ రేట్లను తరచూ మారుస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను చెక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. 'ఎస్బీఐ వీకేర్ డిపాజిట్' స్కీమ్‌లో డిపాజిట్ చేయాలంటే వయస్సు 60 ఏళ్ల పైనే ఉండాలి. భార్యాభర్తలు సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. నామినేషన్ సదుపాయం కూడా ఉంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.15,00,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. మొదట ఐదేళ్లకు డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)