2. క్రెడిట్ కార్డులో ఎంత లిమిట్ ఉంటే అంతవరకు వాడుకొని 15 రోజుల నుంచి 45 రోజుల మధ్య బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. లేదా ఈఎంఐగా మార్చుకోవచ్చు. ఇప్పుడు డెబిట్ కార్డులో కూడా అలాంటి సేవల్ని అందిస్తున్నాయి బ్యాంకులు. ఈ ఫెస్టివల్ సీజన్లో షాపింగ్ చేయాలనుకునేవారికి డెబిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఈఎంఐ బెనిఫిట్స్ చూస్తే మీరు రూ.1,00,000 వరకు లోన్ పొందొచ్చు. అంటే మీరు మీ డెబిట్ కార్డుతో కనీసం రూ.8000 నుంచి గరిష్టంగా రూ.1,00,000 వరకు షాపింగ్ చేయొచ్చు. ఆ మొత్తాన్ని 6, 9, 12, 18 నెలలు ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. ఈ ప్రాసెస్కు ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండదు. వెంటనే లోన్ మంజూరవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. చాలావరకు వస్తువులు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లతో అందిస్తున్నాయి ప్రముఖ బ్రాండ్లు. కాబట్టి నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనొచ్చు. డెబిట్ కార్డ్ ఈఎంఐకి జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. రూ.25,000 వరకు ప్రీ-పేమెంట్ పెనాల్టీ ఉండదు. అంతకన్నా ఎక్కువ అయితే రూ.2500 లేదా లోన్ మొత్తంలో 3 శాతం పెనాల్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. మీకు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఉందో లేదో తెలుసుకోవడానికి SMS DCEMI అని టైప్ చేసి 567676 నెంబర్కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపాలి. ఈ సర్వీస్ ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందిస్తోంది ఎస్బీఐ. కాబట్టి కస్టమర్లు ముందే ఎలిజిబిలిటీ తెలుసుకొని షాపింగ్ ప్లాన్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. మీకు డెబిట్ కార్డ్ ఈఎంఐ వర్తిస్తే మీరు షాపింగ్ చేసిన స్టోర్లో ఎస్బీఐ డెబిట్ కార్డును పీఓఎస్ మెషీన్లో స్వైప్ చేయండి. అందులో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోండి. పిన్ ఎంటర్ చేయండి. పేమెంట్ పూర్తైన తర్వాత స్లిప్ తీసుకోండి. ఆన్లైన్లో అయితే పేమెంట్ సెక్షన్లో డెబిట్ కార్డ్ ఈఎంఐ సెలెక్ట్ చేసి పేమెంట్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)