7. పర్చేస్ ప్రొటెక్షన్ ఇన్స్యూరెన్స్: మీరు కొన్న వస్తువుల్ని ఎవరైనా కొట్టేసినా, దోపిడీకి గురైనా, ఇంట్లో దొంగలు కాజేసినా, వాహనాల్లోంచి దొంగిలించినా ఇన్స్యూరెన్స్ వర్తిస్తుంది. మీరు వస్తువులు కొన్న 90 రోజుల వరకే ఇన్స్యూరెన్స్ ఉంటుంది. మీరు ఆ వస్తువుల్ని అర్హతగల డెబిట్ కార్డుల నుంచి కొనుగోలు చేసి ఉండాలి. పాడైపోయే వస్తువులు, నగలు, విలువైన రాళ్లకు బీమా వర్తించదు. ఏ కార్డుపై ఎంత బీమా వస్తుందో చార్టులో చూడండి. (Source: SBI)
8. లాస్ట్ కార్డ్ లయబిలిటీ: ఎవరైనా మీ డెబిట్ కార్డు దొంగిలించి అనధికారిక లావాదేవీలు జరిపితే పాలసీ కవర్ అవుతుంది. అయితే మీ కార్డు పోయిన తర్వాత అనధికారిక లావాదేవీకి రెండు రోజుల ముందు నుంచి ఏడు రోజుల తర్వాతి వరకు మీరు ఫిర్యాదు చేస్తేనే బీమా పొందొచ్చు. పిన్ లేదా ఓటీపీ ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్టైతే బీమా వర్తించదు. ఏ కార్డుపై లాస్ట్ కార్డ్ లయబిలిటీ ఎంత వస్తుందో తెలుసుకునేందుకు ఈ చార్ట్ చూడండి. (Source: SBI)