1. బ్యాంకులో అకౌంట్ మెయింటైన్ చేయాలంటే అందులో కనీస బ్యాలెన్స్ తప్పనిసరి. మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ తీసుకున్న ప్రాంతాన్ని, అకౌంట్‌ను బట్టి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మారుతుంది. బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవాళ్లు బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక జరిమానాలు చెల్లిస్తూ ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ లేని అకౌంట్‌ను ఆఫర్ చేస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(BSBD) అకౌంట్. దీన్నే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని పిలుస్తారు. కేవైసీ సరిగ్గా ఉన్నవారు దేశంలోని అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో BSBD తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)