STATE BANK OF INDIA SBI ISSUES IMPORTANT NOTICE TO 42 CRORE CUSTOMERS REGARDING INTERNET BANKING YONO AND UPI SERVICES SS
SBI Important Notice: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్... రెండున్నర గంటలు అన్ని బ్యాంకింగ్ సేవలు బంద్
SBI Important Notice | మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమరా? ఎస్బీఐ అకౌంట్ ఉందా? రెండున్నర గంటలు పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఎప్పుడో తెలుసుకోండి.
1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI దేశవ్యాప్తంగా ఉన్న 42 కోట్ల కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. రెండున్నర గంటలపాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నట్టు ఎస్బీఐ ట్విట్టర్లో వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. ఎస్బీఐ ట్వీట్లోని సమాచారం ప్రకారం 2021 జూలై 16 రాత్రి 10.45 గంటల నుంచి 2021 జూలై 17 అర్ధరాత్రి 1.15 గంటల వరకు మొత్తం 150 నిమిషాల పాటు అంటే రెండున్నర గంటలు బ్యాంకింగ్ సేవలు లభించవు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. రెండున్నర గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు ఏవీ లభించవు. మెయింటనెన్స్ కార్యకలాపాల కారణంగా ఈ సేవలు లభించవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఎస్బీఐ కస్టమర్లు ఈ సమయంలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోవడం మంచిది. ఒకవేళ లావాదేవీలు చేసేందుకు ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యే అవకాశాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ సేవల్ని, కొత్త ఫీచర్స్‌ని, అందించేందుకు, అప్డేట్స్ చేసేందుకు తరచుగా మెయింటనెన్స్ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటుంది ఎస్బీఐ. అందులో భాగంగా మరోసారి మెయింటనెన్స్ కార్యకలాపాలు చేపట్టింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. అర్థరాత్రి సమయంలో బ్యాంకింగ్ లావాదేవీలు దాదాపు తక్కువగా ఉంటాయి కాబట్టి మెయింటనెన్స్ కార్యకలాపాలు ఈ సమయంలోనే జరుగుతుంటాయి. కాబట్టి కస్టమర్లు ఈ సమయంలో ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)