4. మెట్రో, అర్బన్‌లో స్మాల్ లాకర్‌కు గతంలో రూ.1,500 ఉంటే ఇకపై రూ.2,000 చెల్లించాలి. మీడియం లాకర్ ఛార్జీలు రూ.3,000 నుంచి రూ.4,000 చేసింది బ్యాంకు. లార్జ్ లాకర్‌కు రూ.6,000 ఉంటే మార్చి 31 నుంచి రూ.8,000 చెల్లించాలి. ఇక ఎక్స్ట్రా లార్జ్ లాకర్‌పై రూ.3,000 ఛార్జీలు పెరిగాయి. ప్రస్తుతం రూ.9,000 ఉంటే కొత్త ఛార్జీల ప్రకారం రూ.12,000 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక సెమీ అర్బన్, రూరల్‌లో చిన్న లాకర్‌కు ప్రస్తుతం రూ.1,000 ఉంటే ఇకపై రూ.1,500 చెల్లించాలి. మీడియం లాకర్ ఛార్జీలు రూ.2,000 నుంచి రూ.3,000 చేసింది బ్యాంకు. లార్జ్ లాకర్ ఛార్జీలు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు పెరగడం విశేషం. ఎక్స్ట్రా లార్జ్ లాకర్‌కు అదనంగా రూ.2,000 చెల్లించాలి. ప్రస్తుతం రూ.7,000 ఛార్జీలు ఉంటే మార్చి 31 నుంచి రూ.9,000 చెల్లించాలి. ఈ ఛార్జీలపై జీఎస్టీ అదనం. (ప్రతీకాత్మక చిత్రం)