STATE BANK OF INDIA SBI HIKES INTEREST RATES ON HOME LOANS HERE FULL DETAILS NS
ఖాతాదారులకు భారీ షాకిచ్చిన SBI.. ఆ వడ్డీ రేట్లు భారీగా పెంపు.. వివరాలివే
SBI-Home Loans: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు వినియోగదారులకు షాకిచ్చింది. హోమ్ లోన్లపై వడ్డీ భారీగా పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గృహ రుణ వినియోగదారులకు చాలా ఉపశమనం లభించింది. దేశంలోని అనేక బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
అయితే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తాజాగా తీసుకున్న నిర్ణయం ఖాతాదారులకు షాకిచ్చింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఎస్బీఐ పెంచడమే ఇందుకు కారణం.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఇప్పటివరకు ఎస్బీఐ హోమ్ లోన్లపై వడ్డీ రేటు 6.70 శాతం ఉంది. ఇప్పుడు అది 6.95 శాతానికి పెరిగింది. ఈ వడ్డీ రేటులో పెరుగుదల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అయితే మార్చిలో వడ్డీ రేట్లపై ఎస్బీఐ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 6.70 శాతం వడ్డీ రేటుతో హోమ్ లోన్లను అందించింది ఎస్బీఐ. ఈ ఆఫర్ మార్చి 31 వరకు కొనసాగింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
అయితే ఇప్పుడు బ్యాంకు హోమ్ లోన్లపై వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో కొత్త రేటు ఇప్పుడు 6.95 శాతానికి చేరింది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఇదిలా ఉంటే ఎస్బీఐ గృహ రుణాలపై విధించే ఏకీకృత ప్రాసెసింగ్ ఫీజు కూడా రుణ మొత్తంలో 0.40 శాతం మరియు వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
మొత్తం ప్రాసెసింగ్ ఫీజు కనీసం రూ. 10,000 మరియు గరిష్టంగా రూ. 30,000 ప్లస్ జీఎస్టీ అవుతుంది. గత నెలలో ఎస్బీఐ మార్చి 31 లోగా గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)