SBI: ఎస్బీఐలో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన బ్యాంక్
SBI: ఎస్బీఐలో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి షాకిచ్చిన బ్యాంక్
SBI Interest Rates | మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI సేవింగ్స్ అకౌంట్ ఉందా? మీ దగ్గర అదనంగా ఉన్న డబ్బుల్ని సేవింగ్స్ అకౌంట్లో దాచుకుంటున్నారా? సేవింగ్స్ అకౌంట్లో వచ్చే వడ్డీ కోసం ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేస్తుంటారా? అయితే మీకు షాకే. ఎందుకో తెలుసుకోండి.
1. సేవింగ్స్ అకౌంట్‌పై ఇచ్చే వడ్డీని తగ్గించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI గతంలో 3 శాతంగా ఉన్న వడ్డీని 2.75 శాతానికి తగ్గించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. అంటే మీరు రూ.1,00,000 సేవింగ్స్ అకౌంట్లో దాచుకుంటే మీకు ఏడాదికి వచ్చే వడ్డీ 2.75 శాతం మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. ఈ కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయి. బ్యాంకు ఇలా వడ్డీ రేట్లు తగ్గించడం వరుసగా ఇది 11వ సారి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేట్‌ను 75 బేసిస్ పాయింట్స్ తగ్గించడంతో ఎస్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్‌ను 0.35% తగ్గించింది. దీంతో ఈఎంఐలు దిగిరానుండటం లోన్లు తీసుకున్నవారికి శుభవార్తే. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. ఎస్బీఐలో హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లాంటి రుణాలు తీసుకున్నవారందరికీ ఇది వర్తిస్తుంది. అన్ని కాలవ్యవధుల రుణాలకు ఇది వర్తించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.75 శాతం నుంచి 7.40 శాతానికి దిగిరానుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ వడ్డీని తగ్గించడం వరుసగా ఇది 11వ సారి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. ఈ కొత్త వడ్డీ రేట్లు 2020 ఏప్రిల్ 10 నుంచి అమలులోకి వస్తాయి. హోమ్ లోన్ కస్టమర్లకు 30 ఏళ్ల లోన్‌పైన రూ.1,00,000 పై రూ.24 చొప్పున ఈఎంఐ తగ్గుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. ఎంసీఎల్ఆర్తో లింక్ చేసిన లోన్లు తీసుకున్న రుణగ్రహీతలకే ఇది వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)