SBI Offers: కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఆఫర్ ఇచ్చిన SBI.. ఆ వస్తువుల కొనుగోళ్లపై భారీ క్యాష్‌బ్యాక్.. వివరాలివే
SBI Offers: కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఆఫర్ ఇచ్చిన SBI.. ఆ వస్తువుల కొనుగోళ్లపై భారీ క్యాష్‌బ్యాక్.. వివరాలివే
కరోనా విపత్తు వేళ అంతా ఇబ్బంది పడుతున్న వేళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India) తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు వస్తువుల కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ఖాతాదారులకు సర్ ప్రైజ్ లు అందిస్తూనే ఉంటుంది. మెరుగైన సేవలతో పాటు ఆర్షణీయమైన ఆఫర్లను సైతం ఈ బ్యాంకు అందిస్తూ ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గృహోపకరణల వస్తువుల కొనుగోళ్లపై భారీ డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఎస్బీఐ కార్డు ద్వారా షాపింగ్ చేసి వాషింగ్ మిషన్, ఫ్రిజ్, మైక్రోవేవ్ తదితర వస్తువులపై రూ. 1000 వరకు క్యాష్ బ్యాక్ పొందాలని సూచించింది ఎస్బీఐ.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఎస్బీఐ కార్డు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆఫర్ పొందాలంటే ఖాతాదారులు క్రోమా స్టోర్‌కు వెళ్లి షాపింగ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే క్రోమా వెబ్సైట్ ద్వారా కూడా కొనుగోళ్లు చేయవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
అయితే.. కొనుగోలుదారులు బిల్లు మొత్తాన్ని తప్పనిసరిగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారానే చెల్లించాల్సి ఉంటుందని బ్యాంకు స్పష్టం చేసింది. కనీసం రూ.20 వేల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే క్యాష్‌బ్యాక్ ఆఫర్ వర్తించనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ ఆఫర్ జూన్ 27 వరకు అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే క్రోమాలో షాపింగ్ చేసి క్యాష్ బ్యాక్ ఆఫర్ అందుకోండి.(ఫొటో: ట్విట్టర్)