1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులను అప్రమత్తం చేస్తోంది. చాలాకాలంగా నో యువర్ కస్టమర్ (KYC) మోసాలు బాగా పెరిగిపోయాయి. భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దిగ్గజం అయిన ఎస్బీఐకి ఖాతాదారులు ఎక్కువ. దీంతో మోసపోయేవారిలో ఎస్బీఐ కస్టమర్లు ఎక్కువగా ఉంటున్నారు. ఈ మోసాలన్నీ బ్యాంకు దృష్టికి వచ్చాయి. దీంతో ఎస్బీఐ తమ ఖాతాదారులను కేవైసీ మోసాలపై అలర్ట్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేవైసీ మోసాలు నిజమేనని, ఈ మోసాలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయని ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించింది. ఇదే విషయంపై మరోసారి కస్టమర్లను హెచ్చరిస్తోంది ఎస్బీఐ. మీరూ ఇలాంటి మోసాల బారినపడ్డా, మిమ్మల్ని ఎవరైనా మోసం చేయాలని చూసినా http://cybercrime.gov.in వెబ్సైట్లో కంప్లైంట్ చేయాలని కోరుతోంది ఎస్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
5. మరి ఎస్బీఐ ఖాతాదారులు తమ అకౌంట్‌ను ఎలా సేఫ్‌గా ఉంచాలో తెలుసుకోండి. మీకు ఎస్బీఐ పేరుతో ఏవైనా లింక్స్ వస్తే అస్సలు క్లిక్ చేయొద్దు. ముఖ్యంగా కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని లింక్స్ వచ్చినా పట్టించుకోవద్దు. ఎవరైనా కాల్ చేసినా మీ వివరాలు అస్సలు చెప్పొద్దు. మీకు పదేపదే ఇమెయిల్స్ వస్తున్నట్టైతే ఆ మెయిల్ ఐడీని బ్లాక్ చేయాలి. మీకు మళ్లీ ఆ మెయిల్ ఐడీ నుంచి మెయిల్స్ రావు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక ఈ మధ్య సైబర్ నేరగాళ్లు వాట్సప్ ద్వారా కూడా మెసేజెస్ పంపుతున్నారు. ఎస్బీఐ లోగో ఉపయోగించుకొని ఈ మెసేజెస్ చేస్తున్నారు. ఎస్బీఐ లోగో కనిపించేసరికి కస్టమర్లు అది బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్‌గా భావిస్తున్నారు. కేవైసీ అప్డేట్ చేయడానికి లింక్ క్లిక్ చేస్తున్నారు. ఆ తర్వాత ఓపెన్ అయ్యే వెబ్సైట్ కూడా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ లాగానే ఉంటుంది. కాబట్టి కస్టమర్లు సులువుగా మోసపోతున్నారు. అందుకే ఈ లింక్స్ అస్సలు క్లిక్ చేయొద్దు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఒకవేళ మీరు మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలనుకుంటే ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లాలి. లేదా అధికారిక వెబ్సైట్లో వివరాలు అప్డేట్ చేయాలి. ఒకవేళ కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలంటూ మీకు పదేపదే కాల్స్ వస్తున్నట్టైతే http://cybercrime.gov.in వెబ్సైట్లో కంప్లైంట్ చేయొచ్చు. దీంతో పాటు ఎస్బీఐ టోల్‌ఫ్రీ నెంబర్స్ అయిన 18004253800, 1800112211 నెంబర్స్‌కు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)