1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోమ్ లోన్ ఆఫర్స్ ప్రకటించింది. వడ్డీ రేటులో భారీగా తగ్గింపు ప్రకటించింది. అంతేకాదు, ప్రాసెసింగ్ ఫీజ్ కూడా మినహాయించింది. ఎస్బీఐ కస్టమర్లు 2023 జనవరి 31 వరకు ఈ ఆఫర్ పొందొచ్చు. ఎస్బీఐ ఇప్పటి వరకు రూ.6 లక్షల కోట్లకు పైగా గృహ రుణాలు ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రూ.6 లక్షల కోట్లకు పైగా హోమ్ లోన్ మార్క్ దాటినట్టు కొద్ది రోజుల క్రితం ఎస్బీఐ ప్రకటించింది. 2021 జనవరిలో ఎస్బీఐ రూ.5 లక్షల కోట్ల మార్క్ దాటిన సంగతి తెలిసిందే. 19 నెలల్లో మరో రూ.1 లక్ష కోట్ల గృహ రుణాలు మంజూరు చేసింది. ఏకంగా రూ.6 లక్షల కోట్ల మార్క్ దాటింది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ కొద్దిరోజుల క్రితం హోమ్ లోన్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే ఇటీవల ఆర్బీఐ రెపో రేట్ పెంచడంతో ఈ ఆఫర్లో ఎస్బీఐ కొన్ని మార్పులు చేసింది. ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగాయి కాబట్టి, ఆఫర్లో లభించే వడ్డీ కూడా కాస్త పెరుగుతుంది. సవరించిన వడ్డీ ప్రకారం ప్రస్తుతం ఎస్బీఐలో గృహ రుణాలు 8.75 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కస్టమర్ల క్రెడిట్ స్కోర్, ప్రొఫైల్‌ను బట్టి వడ్డీ రేటు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆఫర్లో భాగంగా వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్ డిస్కౌంట్ ప్రకటించింది ఎస్బీఐ. 2023 జనవరి 31 వరకు ఈ డిస్కౌంట్ పొందొచ్చు. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పైనా ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికి, లోన్ టేకోవర్లకు 8.75 శాతం నుంచి, టాప్ అప్ లోన్లకు 9.15 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం అవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. హోమ్ లోన్లపై 0.25 శాతం, టాప్ అప్ లోన్లపై 0.15 శాతం, ప్రాపర్టీపై తీసుకునే రుణాలపై 0.30 శాతం చొప్పున తగ్గింపు ప్రకటించింది. ఇక హోమ్ లోన్‌కు అప్లై చేస్తే వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఎస్బీఐలో 2023 జనవరి 31 వరకు హోమ్ లోన్ తీసుకునేవారు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్లిన అవసరం లేదు. ఎస్బీఐలో రుణాలకు అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎస్బీఐ హోమ్ లోన్‌కు అప్లై చేయడానికి యోనో ఎస్బీఐ యాప్ ఓపెన్ చేయాలి. టాప్ లెఫ్ట్ కార్నర్లో త్రీ లైన్స్ పైన క్లిక్ చేయాలి. లోన్స్ సెక్షన్లోకి వెళ్లాలి. హోమ్ లోన్ పైన క్లిక్ చేయాలి. పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. ఆదాయ మార్గాల వివరాలు తెలపాలి. నెలవారీ ఆదాయ వివరాలు ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)