SBI Interest Rates | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. వీటిల్లో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ సేవలు కూడా ఉన్నాయి. దీని ద్వారా కస్టమర్లు మిలియనీర్లు అయిపోవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
ఇలా మీరు ప్రతి నెలా రూ. 6,200 చొప్పున పదేళ్ల పాటు ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బులు పెడుతూ వెళ్లాలి. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి ఏకంగా రూ. 10 లక్షలకు పైగా లభిస్తాయి. మీరు డిపాజిట్ చేసే మొత్తం ప్రాతిపదికన మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రాబడి వస్తుంది.