ప్రస్తుతం వివిధ ప్లాట్‌ఫారమ్‌లు క్రెడిట్ కార్డ్ (Credit Card) ఉపయోగించి అద్దె చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ విత్‌డ్రా చేయాలంటే దాదాపు 2.5 నుంచి 3 శాతం వరకు ఛార్జీలు ఉంటాయి. వీటిని అధిగమించేందుకు పే రెంట్ ఆప్షన్ (Pay Rent) ను దుర్వినియోగం చేస్తున్నట్లు నిపుణులు తెలిపారు.
* నవంబర్ 15 నుంచి అమలు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు పంపిన SMSలో, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌పై ఛార్జీలను 2022 నవంబర్ 15 నుంచి సవరిస్తున్నట్లు తెలిపింది. మరింత సమాచారం కోసం, కస్టమర్లు బ్యాంక్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సూచించింది. మర్చంట్ EMI ట్రాన్సాక్షన్లపై ప్రాసెసింగ్ ఫీజు రూ.199+ టాక్స్ ఉంటుందని తెలిపింది.
సవరించక ముందు ప్రాసెసింగ్ ఫీజు రూ.99+ ట్యాక్స్ ఉండేదని తెలిపింది. రెంట్ పే ట్రాన్సాక్షన్లపై ప్రాసెసింగ్ ఫీజు రూ.99 + ట్యాక్స్ ఉండేది. అయితే ఈ ఫీజును బ్యాంక్ పెంచింది. ఇప్పుడు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రెంట్ పే చేసే కస్టమర్ల నుంచి రూ.199 వసూలు చేస్తుంది. అటువంటి లావాదేవీలపై GST కూడా విధించనుంది. 2022 నవంబర్ 15కి ముందు క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసిన రెంట్ పే ట్రాన్సాక్షన్లకు కొత్త మార్గదర్శకాలు వర్తించవు.
* రెండో బ్యాంక్ ఎస్బీఐ : ఇప్పుడు ఈ తరహా చర్యలు తీసుకున్న రెండో బ్యాంక్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. ఇంతకుముందు ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ హోల్డర్ల నుంచి రెంట్ పే చేసిన మొత్తంలో 1 శాతం ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఈ నిబంధనలను 2022 అక్టోబర్ 20 నుంచి అమలులోకి తెచ్చింది.
* పే రెంట్ ట్రాన్సాక్షన్లపై ఆంక్షలు : కార్డు జారీచేసేవారు రెంట్ పే ట్రాన్సాక్షన్లపై ఆంక్షలు పెట్టడం ప్రారంభించారు. ఇంతకుముందు HDFC బ్యాంక్ కూడా క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్ పే ట్రాన్సాక్షన్లపై రివార్డ్ పాయింట్లను పరిమితం చేసింది. అంతేకాకుండా యస్ బ్యాంక్ సంబంధిత ట్రాన్సాక్షన్లను నెలకు రెండుసార్లు పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంది.
RedGiraffe, Mygate, Cred, Paytm, Magicbricks వంటి వివిధ థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి రెంట్ పే చేసే అవకాశం కల్పిస్తున్నాయి. అయితే ఈ ట్రాన్సాక్షన్లపై కొంత సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తాయి. వినియోగదారులు సంబంధిత ప్లాట్‌ఫారమ్‌లో క్రెడిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేసి, పే రెంట్ ఆప్షన్‌కు వెళ్లి, ఎవరికి పంపాలో వారి బ్యాంకు వివరాలు లేదా యూపీఐ అడ్రెస్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది.