ఆర్థిక సంస్థలకు లోన్ వడ్డీలను నిర్ణయించడంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR) కీలకం. MCLR అనేది బ్యాంకులు లోన్ ఇవ్వడానికి అవకాశం ఉన్న లో బెంచ్‌మార్క్ రేట్. అంతకంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్లు మంజూరు చేయకూడదు. ఈ రేటు పెరిగితే, బ్యాంకు లోన్ ఈఎంఐలు ఆటోమెటిక్‌గా పెరుగుతాయి.
* బ్యాంక్‌లు ఎందుకు రేట్లు పెంచుతున్నాయి? : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయాలతో ఎస్బీఐతో పాటు ఇతర బ్యాంక్‌లు కూడా లోన్ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఆర్బీఐ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వరుసగా రెపో రేటును పెంచుతూ వచ్చింది. మే నుంచి ఆర్బీఐ రెపో రేటును 225 బేసిస్ పాయింట్లు పెంచి 6.25 శాతానికి తీసుకొచ్చింది.
* ఎస్బీఐ లేటెస్ట్ MCLR రేట్లు ఇలా : ఎస్బీఐ MCLR రేట్ల పెంపుతో ఓవర్‌నైట్ MCLR రేటు ఇప్పుడు 7.85 శాతంగానే ఉంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఒక నెల, మూడు నెలల టెన్యూర్‌కి ఎంసీఎల్ఆర్ 8.00 శాతంగా ఉంది. ఆరు నెలల టెన్యూర్‌కి MCLR 8.30 శాతంగా ఉంది. తాజాగా ఇందులోనూ ఎలాంటి మార్పు లేదు. వన్ ఇయర్ టెన్యూర్ MCLR 8.30 శాతంగా ఉండగా, తాజా పెంపుతో 8.40కి పెరిగింది. టూ ఇయర్స్ టెన్యూర్ MCLR 8.50 శాతంగా, త్రీ ఇయర్స్ టెన్యూర్ MCLR 8.60 శాతంగా ఉన్నాయి. వీటిల్లో కూడా ఎలాంటి మార్పు లేదు.
* SBI ఫెస్టివల్ ఆఫర్ : మరోవైపు, SBI ప్రస్తుతం తన ఫెస్టివల్ ఆఫర్ కింద హోమ్ లోన్లపై నిర్దిష్ట రాయితీని అందిస్తోంది. ఈ ఆఫర్ 2023 జనవరి 31న ముగియనుంది. దీని ద్వారా బ్యాంక్ వివిధ హోమ్ లోన్ కేటరిగీలకు 15 బేసిస్ పాయింట్ల నుంచి 30 బేసిస్ పాయింట్ల వరకు రాయితీని అందిస్తోంది. SBI హోమ్ లోన్ వడ్డీ రేట్లు రుణగ్రహీత CIBIL స్కోర్‌పై ఆధారపడి ఉంటాయని గమనించాలి. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే హోమ్ లోన్ వడ్డీ రేటు అంత తక్కువగా ఉంటుంది.
కనీసం 800 CIBIL స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు SBI హోమ్ లోన్‌పై 15 బేసిస్ పాయింట్లు (bps) రాయితీ ఉంటుంది. దీంతో వడ్డీ రేటు 8.90 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గుతుంది. CIBIL స్కోర్ 750 నుంచి 799 మధ్య ఉంటే.. హోమ్ లోన్ వడ్డీ రేటు 9 శాతం నుంచి 8.75 శాతానికి తగ్గుతుంది. 700 నుంచి 749 క్రెడిట్ స్కోర్ ఉంటే వడ్డీ రేటు 9.10 శాతం నుంచి 20 బేసిస్ పాయింట్ల తగ్గింపుతో 8.90 శాతానికి తగ్గుతుంది.