1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) 15 బేసిస్ పాయింట్స్ వరకు పెంచింది. అన్ని కాలవ్యవధులకు పెరిగిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. దీంతో కస్టమర్లకు ఈఎంఐలు భారం కానున్నాయి. పెరిగిన వడ్డీ రేట్లు 2022 నవంబర్ 15 నుంచి అంటే ఇవాళ్టి నుంచే అమలులోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. సాధారణంగా హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను నిర్ణయించడానికి పరిగణలోకి తీసుకునే ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్స్ పెరిగింది. దీంతో ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.95 శాతం నుంచి 8.05 శాతానికి పెరిగింది. అలాగే మూడేళ్ల ఎంసీఎల్ఆర్ కూడా 10 బేసిస్ పాయింట్స్ పెరగడంతో 8.25 శాతం నుంచి 8.35 శాతానికి చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇక ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 15 బేసిస్ పాయింట్స్ పెరిగింది. దీంతో ఎంసీఎల్ఆర్ 7.60 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ కూడా 15 బేసిస్ పాయింట్స్ పెరిగింది. దీంతో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.90 శాతం నుంచి 8.05 శాతానికి పెరిగింది. ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్స్ పెరిగి 7.60 శాతానికి చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇలా ఎస్బీఐ వేర్వేరు కాలవ్యవధుల ఎంసీఎల్ఆర్ పెంచడం కస్టమర్లకు బ్యాడ్ న్యూసే. ఎంసీఎల్ఆర్ పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయి. 100 బేసిస్ పాయింట్స్ ఒక శాతంతో సమానం. తాజాగా కస్టమర్లకు 15 బేసిస్ పాయింట్స్ వరకు వడ్డీ భారం కానుంది. పర్సనల్ లోన్, వెహికిల్ లోన్, హోమ్ లోన్ ఈఎంఐలు భారమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గించడం విశేషం. హోమ్ లోన్ వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. 8.25 శాతం వడ్డీకే గృహ రుణాలను అందిస్తోంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే. 2022 డిసెంబర్ 31 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ విభాగం అయిన ఎస్బీఐ కార్డ్ కూడా ఛార్జీల మోత మోగిస్తోంది. క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తే... రూ.99 + జీఎస్టీ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవల క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించే కస్టమర్ల సంఖ్య పెరిగింది. దీంతో ఎస్బీఐ కార్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)