ఇంకా 180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్డీలపై వడ్డీ రేటు 4.55 శాతం నుంచి 4.65 శాతానికి చేరింది. 211 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్డీలపై అయితే వడ్డీ రేటు 4.6 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది. ఇప్పుడు ఏడాది నుంచి రెండేళ్ల టెన్యూర్‌లోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.6 శాతంగా ఉంది. ఇదివరకు ఈ టెన్యూర్‌పై వడ్డీ రేటు 5.45 శాతంగా ఉండేది.
ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు కూడా బ్యాంక్ తీపికబురు అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచేసింది. వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్లు పెరిగింది. వీరికి 3.5 శాతం నుంచి 6.65 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. కాగా కొత్తగా ఎఫ్డీ చేసే వారికి లేదంటే పాత ఎఫ్డీలను రెన్యూవల్ చేసుకునే వారికి మాత్రమే కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని గుర్తించుకోవాలి.