2. ఆ సమయంలో నామినీ పేరు రాయనివాళ్లు తర్వాత నామినేషన్ ఫెసిలిటీ ఉపయోగించుకొని నామినీ పేరు అప్డేట్ చేయొచ్చు. ఒకవేళ నామినీ పేరు మార్చాలనుకున్నా ఈ ప్రాసెస్ సులభమే. ఎస్బీఐ 3 పద్ధతుల్లో నామినీ పేరు అప్డేట్ చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఆన్లైన్లో కూడా నామినీ పేరు అప్డేట్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. బ్యాంక్ అకౌంట్, డిపాజిట్ అకౌంట్ లాంటి వాటి కోసం నామినీ పేరు అప్డేట్ చేయడం అవసరం. ఇన్స్యూరెన్స్ పాలసీకి నామినీ పేరు తప్పనిసరి ఎందుకంటే, పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, పాలసీ బెనిఫిట్స్ నామినీకి అందిస్తుంది ఇన్స్యూరెన్స్ సంస్థ. అలాగే బ్యాంక్ అకౌంట్లు, డిపాజిట్ అకౌంట్లలోని డబ్బుల్ని తమ తదనంతరం ఎవరికి చెందాలో బ్యాంకుకు చెప్పేందుకు నామినీ పేరు అప్డేట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇండివిజువల్ అకౌంట్స్, జాయింట్ అకౌంట్లకు మాత్రమే నామినేషన్ సదుపాయం ఉంటుంది. ఒకసారి నామినీ పేరు అప్డేట్ చేసిన తర్వాత ఎప్పుడైనా పేరు మార్చవచ్చు. లేదా తొలగించవచ్చు. నామినీగా మైనర్ పేరు యాడ్ చేయొచ్చు. అకౌంట్ హోల్డర్ లేదా డిపాజిటర్ మరణించిన తర్వాత వారికి సంబంధించిన డబ్బులు నామినీకి లభిస్తాయి. మరి నామినీ పేరు ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)