1. మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? పెట్టుబడి లేదా? అయినా బిజినెస్ చేయొచ్చు. ఇందుకోసం మీ దగ్గర ఓ స్మార్ట్‌ఫోన్, కాస్త టాలెంట్ ఉంటే చాలు. నెలకు రూ.30,000 వరకు సంపాదించొచ్చు. ఫ్లిప్‌కార్ట్ కొత్తగా ప్రారంభించిన Shopsy ప్లాట్‌ఫామ్ ద్వారా ఇది సాధ్యం. ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయండి అంటూ పిలుపునిస్తోంది షాప్సీ ప్లాట్‌ఫామ్. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇది ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన సంస్థ. ఫ్లిప్‌కార్ట్‌లో కనిపించే ప్రొడక్ట్స్ షాప్సీ వెబ్సైట్, యాప్‌లో కనిపిస్తాయి. ఫ్యాషన్, బ్యూటీ, మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని కేటగిరీల్లో ఫ్లిప్‌కార్ట్ సెల్లర్స్ 15 కోట్ల ప్రొడక్ట్స్‌ని అమ్ముతున్నారు. ఈ ప్రొడక్ట్స్‌ని మీ స్నేహితులు, బంధువులకు రికమండ్ చేసి, వారి కోసం మీరు ఆర్డర్ చేస్తే మీకు కమిషన్ వస్తుంది. (image: shopsy_app)
3. మెట్రో నగరాలు కాకుండా నాన్ మెట్రో ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని షాప్సీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది ఫ్లిప్‌కార్ట్. 2023 నాటికి 2.5 కోట్ల ఆన్లైన్ ఆంట్రప్రెన్యూర్లను ఆ ప్లాట్ఫామ్లో చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఫ్లిప్‌కార్ట్. యూజర్లు ఈ ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకొని వెంటనే బిజినెస్ మొదలుపెట్టొచ్చు. (image: shopsy_app)
5. ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే ఎంత కమిషన్ వస్తుందనేది ఆ ప్రొడక్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒక మీ ఫ్రెండ్ కోసం ఓ స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేస్తే రూ.50 కమిషన్ వస్తుంది. అదే ల్యాప్‌టాప్ లాంటి ఖరీదైన ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తే రూ.5000 వరకు కమిషన్ వస్తుంది. ఇలా ప్రొడక్ట్‌ని బట్టి కమిషన్ మారుతుంది. (image: shopsy_app)