1. కొన్ని వ్యాపారాలు వినడానికి చాలా చీప్‌గా అనిపిస్తాయి. కానీ అలాంటి వ్యాపారాల్లో లాభాలు ఎలా ఉంటాయో తెలిస్తే షాకవ్వాల్సిందే. చిన్న చిన్న పట్టణాల్లో కూడా చిప్స్ అమ్మే షాపులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. చిప్స్ కదా అని చీప్‌గా తీసేయొద్దు. ఈ వ్యాపారంతో నెలకు రూ.40,000 వరకు సంపాదించొచ్చు. పెట్టుబడి కూడా తక్కువే. (ప్రతీకాత్మక చిత్రం)
2. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తర్వాత వ్యాపారాలు చేయాలన్న (Small Businesses) ఆలోచన ప్రజల్లో పెరిగింది. ఇందుకు కారణం... ప్రస్తుతం ఉద్యోగం ద్వారా వస్తున్న జీతం సరిపోకపోవడం ఒకటైతే... ఇప్పటికే వ్యాపారం చేస్తున్నవారు మరో బిజినెస్ చేయాలన్న (Business Idea) ఆలోచన పెరగడం మరో కారణం. అందుకే తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల గురించి వెతుకుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో పొటాటో చిప్స్ బిజినెస్ ప్రారంభించొచ్చు. పొటాటో చిప్స్‌లో చాలా రకాలు ఉంటాయి. వేర్వేరు ఫ్లేవర్స్‌తో చిప్స్ తయారు చేయొచ్చు. మంచి పదార్థాలతో మంచి క్వాలిటీతో చిప్స్ తయారు చేస్తే ఎక్కువ అమ్మకాలు చేయొచ్చు. ఏ ఫుడ్ ఐటెమ్ తయారుచేయాలన్నా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ బిజినెస్‌ను ఎంఎస్ఎంఈగా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. దీంతో పాటు ట్రేడ్ లైసెన్స్ కావాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మీ బిజినెస్ పేరుతో పాన్ కార్డ్ తీసుకోవాలి. FSSAI లైసెన్స్ కూడా తప్పనిసరి. చిప్స్ తయారు చేసే మెషీన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.35,000 చెల్లించి చిప్స్ తయారీ మెషీన్ తెచ్చుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇంట్లోనే చిన్న గదిలో ఈ బిజినెస్ ప్రారభించొచ్చు. పొటాటో చిప్స్ బిజినెస్ ప్రారంభించడానికి రూ.80,000 నుంచి రూ.1,00,000 వరకు పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మెషీన్ కొనకుండా స్వయంగా చిప్స్ తయారు చేస్తే పెట్టుబడి ఇంకా తగ్గుతుంది. కేవలం రూ.10,000 పెట్టుబడితో పొటాటో చిప్స్ తయారీ ప్రారంభించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. మార్కెట్లో ఆర్డినరీ పొటాటో క్వింటాల్ ధర రూ.1,200 ఉంటుంది. స్వీట్ పొటాటో క్వింటాల్ ధర రూ.4,600. చిప్స్ తయారీకి కావాల్సిన నూనె లీటర్ ధర రూ.120. కిలో ఉప్పు ధర రూ.18. కిలో చిల్లీ పౌడర్ ధర రూ.180. ముందు తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం ప్రారంభించి, మంచి క్వాలిటీ చిప్స్‌తో మార్కెటింగ్ చేయొచ్చు. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే మెషీన్ కొనొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. చిప్స్ తయారీ మెషీన్ కొని ఎక్కువ చిప్స్ తయారు చేసి అమ్మగలిగితే నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు సులువుగా సంపాదించొచ్చు. సీజన్‌తో సంబంధం లేని బిజినెస్ ఇది. ఏ సీజన్లో అయినా చిప్స్‌కి డిమాండ్ ఉంటుంది. కిరాణా షాపుల నుంచి స్వీట్ షాపుల వరకు చిప్స్ సప్లై చేయొచ్చు. వ్యాపారం విస్తరించిన తర్వాత సొంత బ్రాండ్‌తో ఆన్లైన్లో కూడా చిప్స్ అమ్మొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)