విమాన ఇందన ధరలు పెరగడంతో మూడో త్రైమాసికంలో ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్ జెట్ లాభాలు 77.1 శాతం మేర తగ్గాయి. 2018 డిసెంబరు నెలాఖరుతో ముగిసిన మూడో త్రైమాసంలో స్పైస్ జెట్ రూ.55.1 కోట్ల లాభాన్ని నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరపు(2017-18) మూడో త్రైమాసంలో ఆ సంస్థ లాభం రూ.240 కోట్లుగా ఉంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసంలో విమాన ఇంధన వ్యయం 54.5 శాతం పెరిగి రూ.968.3 కోట్లకు చేరుకోగా...అంతకు ముందు ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసంలో విమాన ఇంధన వ్యయం రూ.631 కోట్లుగా ఉంది.
విమాన ఇంధన ధరలు 34 శాతం పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 11 శాతం మేర క్షీణించడం తదితరాలతో నిర్వహణ వ్యయం పెరిగింది. నిర్వహణ వ్యయం పెరిగినా...స్పైస్ జెట్ విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 8 శాతం మేర పెరగడం కాస్త ఊరటనిచ్చే అంశం.