స్పైస్ జెట్ మెగా మాన్సూన్ సేల్ ఆఫర్ తో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.999కే ఫ్లైట్ టికెట్ అందిస్తోంది. దేశీ విమాన ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ తెలిపింది. వీటితో పాటు కంపెనీ ఫ్రీ ఫ్లైట్ వోచర్లను కూడా అందిస్తోంది. ఈ వోచర్లను భవిష్యత్ లో ప్రయాణం చేసుకున్నప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. కేవలం రూ.999కే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండని స్పైస్ జెట్ సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది. ఇంకా ఫ్లైట్ టికెట్ బేస్ ధరకు సమాన ఫ్రీ ఫ్లైట్ వోచర్లు సొంతం చేసుకోవచ్చని వివరించింది. ప్రయాణికులు గరిష్టంగా రూ.1000 వరకు ఈ వోచర్లు పొందొచ్చు.