SPECIAL TRAINS WILL RUN BETWEEN SECUNDERABAD AND GUWAHATI RAILWAY OFFICIALS SAID VB
South Central Railway: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ఈ రైళ్లు ప్రారంభం.. వివరాలివే..
South Central Railway: సికింద్రాబాద్ నుంచి గుహవటి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లు రైల్వే శాఖ అధికారులు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో లాక్ డౌన్ సమయం తగ్గించడం.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు సడలింపుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువ అయింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
అయితే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్-గువాహటి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
సికింద్రాబాద్- గువాహటి (07030/07029) స్పెషల్ ట్రైన్ ఈ నెల 6, 13 తేదీల్లో ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి రెండవ రోజు ఉదయం 6.15 గంటలకు గువాహటి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
తిరుగు ప్రయాణంలో ఈనెల 9, 16 తేదీల్లో ఉదయం 6.45 గంటలకు గువాహటి నుంచి బయల్దేరి రెండవ రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరు కుంటుందని వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
త్వరలోనే రద్దయిన రైళ్లను పునరుద్దరిస్తామని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)