కానీ ఇప్పుడు ఆభరణాలు, నాణేలు, బార్లు ఇలా ఫిజికల్ గోల్డ్‌తో పాటు గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bands)లలో పెట్టుబడి పెట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కొత్త మార్గాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఫిజికల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలా? లేక బాండ్ల/డిజిటల్ గోల్డ్‌లో మదుపు చేయాలా? అనేది తెలుసుకోలేకపోతున్నారు ఇన్వెస్టర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
సావరిన్ గోల్డ్ బాండ్ VS ఫిజికల్ గోల్డ్
ఇన్వెస్టర్లకు భౌతిక-యేతర లేదా డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి సావరిన్ గోల్డ్ బాండ్ ఫేవరెట్ గా నిలుస్తోంది. భౌతిక బంగారంలా కాకుండా ఎస్జీబీ (SGB) చక్కటి రాబడిని అందిస్తాయి. ఇవి ఆకర్షణీయమైన రాబడితో పాటు పన్ను ప్రయోజనాలను అందిస్తాయి. వీటి ఇష్యూ రేటును గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఈ బాండ్లు ఐదు సంవత్సరాల లాకిన్ పీరియడ్‌తో.. ఎనిమిది సంవత్సరాల కాలపరిమితితో వస్తాయి. అయితే భౌతిక బంగారం అనేది ఎలాంటి లాకిన్(Lock-in) పీరియడ్‌తో రాదు. భౌతిక బంగారంలో కనీసం 10 గ్రాముల గోల్డ్ కొనాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
కానీ బాండ్లలో ఒక గ్రాము బంగారంలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా నాలుగు కిలోల వరకు బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే ఎలాంటి స్టోరేజ్ కాస్టు, రిస్కు ఉండదు. మీరు కొన్న బంగారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రికార్డులలో డీమ్యాట్ ఫారంలో ఉంటాయి. భౌతిక బంగారం కంటే వీటిపై రాబడి చాలా అధికంగా ఉంటుంది. ఇందుకు కారణం హోల్డింగ్ పీరియడ్‌లో బాండ్లపై పెట్టిన పెట్టుబడి మొత్తంపై వడ్డీ లభించడమే. అలాగే భౌతిక బంగారంలో లాగా మూడు శాతం జీఎస్టీ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంతకీ పెట్టుబడికి ఏది మంచిది?
గోల్డ్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వ్యక్తులకు సావరిన్ గోల్డ్ బాండ్లు ఎక్కువ రాబడిని అందిస్తాయని అనడంలో సందేహం లేదు. భౌతిక బంగారంతో సంబంధం లేకుండా బంగారం ధర పెరుగుదలపై ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులకు సావరిన్ గోల్డ్ బాండ్లు బెస్ట్ ఛాయిస్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎస్‌జీబీలు మెచూరిటీ వరకు.. అంటే 8 ఏళ్ల పాటు ఉంచినట్లయితే మూలధన రాబడిపై పన్ను వర్తించదు. అలాగే సావరిన్ బంగారు బాండ్లు పెట్టుబడి మొత్తంపై వార్షికంగా 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)