ప్రభుత్వం నిర్వహించే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021–22 తొమ్మిదో విడత సబ్స్క్రిప్షన్ ఇవాళ ప్రారంభమైంది. 9వ సిరీస్ జనవరి 10 నుంచి జనవరి 14 మధ్య ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ సిరీస్‌లో ఒక్క బాండ్ ధరను రూ. 4,786 గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పెట్టుబడిదారులకు రూ. 50 ధర తగ్గింపు వర్తిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
అంటే, వారు కేవలం రూ. 4,736 ధరకే ఒక గ్రాము బంగారాన్ని డిజిటల్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. కాగా, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు అందుబాటులో ఉన్న 8వ సిరీస్ గోల్డ్ బాండ్ స్కీమ్ ధరతో పోల్చితే (రూ. 4,791) తాజా ఇష్యూ ధర రూ. 5 తక్కువకే లభిస్తుండటం విశేషం. గోల్డ్ బాండ్ల ఇష్యూ ధర, ఇతర వివరాలు చూద్దాం.(ప్రతీకాత్మక చిత్రం)
ఆన్లైన్ చందాదారులకు తగ్గింపు..
ఆన్లైన్లో గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే చందాదారులందరికీ గ్రాముకి రూ. 50 చొప్పున తగ్గించి అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ చందాదారులకు తొమ్మిదో విడత సావరిన్ గోల్డ్ బాండ్ 2021–22 స్కీమ్‌లో గ్రాము బంగారం ఇష్యూ ధరను రూ. 4,736గా నిర్ణయించింది.(ప్రతీకాత్మక చిత్రం)
నిపుణులు ఏమంటున్నారు?
‘‘ప్రస్తుతం బంగారం ధరలు రెండు నెలల కనిష్టానికి చేరువలో ఉన్నాయి. బంగారం ధరలు 2020లో గరిష్ట స్థాయి నుండి గ్రాము బంగారానికి దాదాపు రూ. 9000 మేర ధర తగ్గింది. యూఎస్ ఫెడ్ కారణంగా గతంలో వేగంగా బంగారం ధరలు పెరిగాయి. ఇప్పుడు అంతే వేగంగా బంగారం ధరలు పడిపోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల మానిటరీ పొజిషన్, యూఎస్ డాలర్లో హెచ్చుతగ్గులను బట్టి 2022 సంవత్సరంలో బంగారం ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అందువల్ల, సావరిన్ గోల్డ్ బాండ్లో పెట్టుబడి పెట్టడం మీకు లాభిస్తుంది.'' అని మిల్‌వుడ్ కేన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు & సీఈవో మిస్టర్ నిష్ భట్ అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)