1. ఈ ఏడాది మదర్స్ డే వచ్చేసింది. మే 8న అందరూ మాతృదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. అందరూ తమ జీవితంలో తల్లి ఎంత ప్రత్యేకమో చెప్పడానికి ఉత్తమ బహుమతులు ఎంపిక చేసే పనుల్లో ఉంటారు. అయితే సంప్రదాయంగా అందించే వివిధ రకాల వస్తువులు కొంత కాలమే ఉంటాయి. కొన్ని రోజులకు వాటిని పక్కన పడేయాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2. అలాంటి ఆలోచనలు పక్కనపెట్టి మదర్స్ డే రోజు ఆమెకు ఎక్కువగా ఖర్చు చేసుకొనే శక్తిని ఇవ్వడం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. తల్లికి ఆర్థిక స్వాతంత్ర్యం, భద్రతను కల్పిస్తే అది జీవితాంతం ఉపయోగపడుతుంది. ఈ మదర్స్ డే సందర్భంగా తల్లికి నిజంగా ఆశ్చర్యం కలిగించే ఐదు ఆర్థిక బహుమతులు పరిశీలించండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆర్థిక సలహాదారు: తల్లి ఇప్పటి వరకు ఆర్థిక నిపుణులతో కలిసి పని చేయకపోతే.. ఆమెకు ఒకరి సేవలను బహుమతిగా ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు. ఆర్థిక సలహాదారు తల్లికి తన ఆర్థిక పోర్ట్‌ఫోలియోను నిర్వహించడంలో సహాయం చేయగలరు. ఆమె డబ్బును సక్రమంగా నిర్వహించడం ద్వారా పదవీ విరమణ లక్ష్యాలను చేరుకోవడంలో ఉపయోగపడతారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. స్టాక్స్/మ్యూచువల్ ఫండ్స్: తల్లికి పెట్టుబడి పెట్టాలనే ఆసక్తి ఉంటే, ఆమెకు ఇష్టమైన కంపెనీకి చెందిన షేర్లను కొని బహుమతిగా ఇవ్వడం చాలా ఆసక్తికరమైన ఆలోచన. ఆమె ఆసక్తిగల పెట్టుబడిదారు కాకపోయినా, మంచి నాణ్యమైన ఈక్విటీ స్టాక్‌లు భవిష్యత్తులో అధిక రాబడిని ఇవ్వగలవు. షేర్లను నేరుగా ఆమె డీమ్యాట్ ఖాతాకు బదిలీ చేయడం ద్వారా వాటిని బహుమతిగా ఇవ్వవచ్చు. గ్రహీత సంబంధిత వివరాలతో రసీదు పూరించాలి. దానిని వారి డిపాజిటరీ పార్టిసిపెంట్‌కు సమర్పించాలి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు బదిలీ కావు. కాబట్టి MFలను బహుమతిగా ఇవ్వడానికి, మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రీడీమ్ చేయండి. ఈ మదర్స్ డే రోజున తల్లికి వచ్చిన మొత్తాన్ని బహుమతిగా ఇవ్వండి. లేదా ఆమె ఖాతాకు నిధులను బదిలీ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. గోల్డ్ బాండ్లు: నిజమైన రాబడి కోసం చూస్తున్నట్లయితే, ఫిజికల్ గోల్డ్‌కు బదులుగా గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించాలి. అంతర్జాతీయ అనిశ్చితులు బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉన్నందున దీని విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే దీని చెల్లింపునకు సావనీర్ హామీన ఉంటుంది. రిడంప్షన్ సమయంలో డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉండదు. అంతేకాకుండా సావరిన్ గోల్డ్ బాండ్ పథకం ప్రకారం అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఎవరికైనా బాండ్లను బహుమతిగా ఇవ్వవచ్చు లేదా బదిలీ చేయవచ్చు. గోల్డ్ బాండ్లు మదర్స్ డే సందర్భంగా తల్లికి బహుమతిగా ఇవ్వడం మంచి ఆలోచన. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆరోగ్య బీమా: తల్లికి ఆరోగ్య కవరేజీని బహుమతిగా ఇవ్వడం వలన ఆమె ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. అవసరమైనప్పుడు ఉత్తమ వైద్య సంరక్షణను పొందగలరు. భారతీయ మార్కెట్లో ప్రస్తుతం విస్తృత హెల్త్‌కేర్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అనేక బీమా ప్రొవైడర్లు కుటుంబంలోని సీనియర్ సభ్యులను చేర్చడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్‌కేర్ ప్లాన్లను కూడా అందిస్తున్నారు. తల్లి వయస్సు 50 కంటే ఎక్కువ ఉంటే ఎంపికలు పరిమితమవుతాయి. అయితే శుభవార్త ఏమిటంటే ఇప్పుడు చాలా కంపెనీలు సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మెడిక్లెయిమ్ పాలసీతో వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీములు (SCSS): తల్లి పని చేస్తూ, 60 ఏళ్లు పైబడినట్లయితే, ఆమెకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ల (SCSS) ప్రయోజనాలను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. SCSS అనేది ప్రభుత్వ-మద్దతు గల పొదుపు పథకం. ఇది సంవత్సరానికి 7.40 శాతం వడ్డీని అందిస్తుంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది. అదనంగా ఒకసారి మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు. అయితే SCSSలో పెట్టుబడి పెట్టడానికి గరిష్ట పరిమితి రూ.15 లక్షలు. SCSSలో పెట్టుబడి కూడా ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)