1. బంగారం కొనాలనుకునేవారికి మరో అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. సావరిన్ గోల్డ్ బాండ్ ధరను భారీగా తగ్గించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ 11 ఒక గ్రాముకు రూ.4,912 ఫిక్స్ చేసింది ఆర్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
3. సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఫిక్స్ చేసేందుకు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ 999 స్వచ్ఛమైన బంగారానికి నిర్ణయించిన ధరలను పరిగణలోకి తీసుకుంటుంది ఆర్బీఐ. గత మూడు బిజినెస్ డేస్‌లో స్వచ్ఛమైన బంగారానికి ఉన్న ధరని యావరేజ్ చేసి సావరిన్ గోల్డ్ బాండ్ ధరను ఫిక్స్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇటీవల కాలంలో ఇంత తక్కువ రేటుకు గోల్డ్ బాండ్ అమ్మలేదు. ఓసారి ఇటీవల గోల్డ్ బాండ్ ప్రైస్ హిస్టరీ చూస్తే సిరీస్ 10 ధర రూ.5,104, సిరీస్ 9 ధర రూ.5,000, సిరీస్ 8 ధర రూ.5,127, సిరీస్ 7 ధర రూ.5,051, సిరీస్ 6 ధర రూ.5,117 గా ఫిక్స్ చేసింది. ప్రతీసారి గోల్డ్ బాండ్ గ్రాము ధర రూ.5,000 కన్నా ఎక్కువే ఉండేది. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఉదాహరణకు ఓ వ్యక్తి ప్రస్తుత సిరీస్‌లో రూ.4,86,200 చెల్లించి 100 గ్రాముల సావరిన్ గోల్డ్ బాండ్ కొన్నాడనుకుందాం. 8 ఏళ్ల తర్వాత గ్రాము బంగారం ధర రూ.8,000 ఉందనుకుందాం. అంటే 100 గ్రాముల బంగారానికి రూ.8,00,000 తిరిగి వస్తుంది. అంతే రూ.4,86,200 ఇన్వెస్ట్ చేస్తే రూ.8,00,000 వస్తుంది. దీంతో పాటు ఏడాదికి 2.5 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లిస్తుంది ఆర్బీఐ. ఈ రిటర్న్స్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
11. సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ చేయొచ్చు. అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో గోల్డ్ బాండ్ అమ్మొచ్చు లేదా కొనొచ్చు. మీ దగ్గర ఉన్న బాండ్స్ అమ్మితే వచ్చే లాభాలపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మార్కెట్లో బంగారం కొంటే జీఎస్టీ కూడా చెల్లించాలి. గోల్డ్‌పైన 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఒకవేళ నగలు చేయిస్తే మేకింగ్ ఛార్జీల పైన 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. కానీ సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటే జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి మార్కెట్లో కొనడం కన్నా సావరిన్ గోల్డ్ బాండ్స్ కొంటేనే రేటు తక్కువ. (ప్రతీకాత్మక చిత్రం)