Sovereign Gold Bond: గోల్డ్ బాండ్ స్కీమ్ మళ్లీ మొదలైంది... మీకు లాభమా? నష్టమా?
Sovereign Gold Bond | సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్... భారత ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ఇది. కొంతకాలంగా గోల్డ్ బాండ్ల జారీ విడతలవారీగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 4న గోల్డ్ బాండ్ల అమ్మకం మళ్లీ మొదలైంది. ఫిబ్రవరి 8 వరకు గోల్డ్ బాండ్ల అమ్మకం ఉంటుంది. మరి గోల్డ్ బాండ్ స్కీమ్ లాభమా? నష్టమా? అసలు సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడి ఎలా పెట్టాలి? తెలుసుకోండి.


1. సావరిన్ గోల్డ్ బాండ్ అంటే ఏంటీ?: భారతీయులకు బంగారం పొదుపుతో పాటు పెట్టుబడి సాధనం. డబ్బు పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టి లాభాలను ఆర్జించడం కోసం బంగారాన్ని కొంటూ ఉంటారు. అయితే ఈ బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొంటారు. దాచుకుంటారు.


2. ఈ ఫిజికల్ గోల్డ్‌ని దాచుకోవడం ఓ పెద్ద సమస్య. అందుకే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 2015న ప్రారంభించింది. ఫిజికల్ గోల్డ్‌కు ఉన్న డిమాండ్ తగ్గించడం కూడా ఓ కారణం.


3. సావరిన్ గోల్డ్ బాండ్స్ అమ్మకాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతాయి. గోల్డ్ బాండ్స్‌ని బ్యాంకులు, ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో కొనొచ్చు.


4. ఓ వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం గరిష్టంగా 4 కిలోల వరకు, ట్రస్టులు 20 కిలోల వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. మైనర్ పేరు మీదా ఈ బాండ్ తీసుకోవచ్చు.


5. గోల్డ్ బాండ్ రేట్‌ని ప్రభుత్వం గ్రాముకు రూ.3,326 ధర నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసి, డిజిటల్ పద్ధతిలో పేమెంట్ చేస్తే గ్రాముకు రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. ఆన్లైన్లో కొనేవారు గ్రాముకు రూ.3,276 చెల్లించాలి.


6. రూ.20,000 వరకు నగదు, అంతకన్నా ఎక్కువైతే డిమాండ్ డ్రాఫ్ట్, చెక్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. మీరు ఫిజికల్ గోల్డ్ కొనడానికి ఎలాంటి కేవైసీ నిబంధనలు ఉంటాయో అవే గోల్డ్ బాండ్స్ కొనడానికీ వర్తిస్తాయి. ప్రతీ దరఖాస్తుపైన ఇన్వెస్టర్ పాన్ నెంబర్ తప్పనిసరి.


7. గోల్డ్ బాండ్స్ వల్ల లాభమేంటీ?: గోల్డ్ బాండ్స్ కూడా ఓ పెట్టుబడి సాధనమే. వీటిని డిమాట్ రూపంలోకి మార్చుకోవచ్చు. వీటిని తాకట్టు పెట్టి రుణాలు కూడా తీసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించే గోల్డ్ లోన్‌కు సమానంతో గోల్డ్ బాండ్స్‌పై లోన్స్ తీసుకోవచ్చు.


8. గోల్డ్ బాండ్స్‌పై వచ్చే వడ్డీకి ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. వీటిపై సంవత్సరానికి నామమాత్రపు విలువపై 2.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీని ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. అసలుతో పాటు మెట్యూరిటీపైన వడ్డీ లభిస్తుంది.