1. ఊటీ... ఈ పేరు వినగానే నీలగిరి కనుమల్లో ఎప్పుడూ అత్యంత చల్లగా ఉండే ప్రదేశం. వేసవిలో కూడా ఇక్కడ అత్యంత చల్లగా ఉంటుంది. వేసవితాపం తట్టుకోలేని వారు కొంతకాలం పాటు ఊటీ వెళ్తుంటారు. ఇక చలికాలంలో చలిని ఇష్టపడేవారు కూడా ఊటీ వెళ్తుంటారు. (image: Indian Railways)
2/ 8
2. ఊటీ అనగానే అందరికీ టాయ్ ట్రైన్ గుర్తొస్తుంది. మెట్టుపాళ్యం-ఉదగమండలం(ఊటీ) రూట్లో ఈ రైలు పరుగులు తీస్తూ ఉంటుంది. ఊటీ వెళ్లేవారు తప్పకుండా ఈ రైలు ప్రయాణం ఆస్వాదించాలని అనుకుంటారు. (image: Indian Railways)
3/ 8
3. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దేశంలోని పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఈ టాయ్ ట్రైన్ కూడా నిలిచిపోయింది. మార్చి 20 నుంచి టాయ్ ట్రైన్ నడవట్లేదు. (image: Indian Railways)
4/ 8
4. కొద్ది రోజులుగా ఊటీ, కూనూర్ లాంటి పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు. కానీ టాయ్ ట్రైన్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో పర్యాటకులు టాయ్ ట్రైన్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. (image: Indian Railways)
5/ 8
5. ఊటీలో టాయ్ ట్రైన్ మళ్లీ పరుగులు తీయనుంది. డిసెంబర్ 31 నుంచి నీల్గిరి మౌంటైన్ రైల్వే-NMR లైన్లో మెట్టుపాళ్యం-ఉదగమండలం రూట్లో టాయ్ ట్రైన్ నడుపుతున్నట్టు సదరన్ రైల్వే ప్రకటించింది. అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది. (image: Indian Railways)
6/ 8
6. మెట్టుపాళ్యం-ఉదగమండలం రూట్లో ఒక రైలు, కూనూర్-ఉదగమండలం రూట్లో మూడు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవ్వి ఫుల్లీ రిజర్వ్డ్ స్పెషల్ ట్రైన్స్. కోవిడ్ కన్నా ముందు ఉన్న ధరలే ఇప్పుడూ ఉంటాయని సదరన్ రైల్వే తెలిపింది. (image: Indian Railways)
7/ 8
7. నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్‌ను 1908 లో బ్రిటీష్ కాలంలో నిర్మించారు. ప్రస్తుతం సదరన్ రైల్వే నీలగిరి మౌంటైన్ రైల్వే లైన్లో రైళ్లను నడుపుతోంది. (image: Indian Railways)
8/ 8
8. మెట్టుపాళ్యం-ఉదగమండలం (ఊటీ), కూనూర్-ఉదగమండలం (ఊటీ) రూట్లలో టాయ్ ట్రైన్స్ నడుస్తున్నాయి. 2005లో నీల్గిరి మౌంటైన్ రైల్వేకు వాల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు లభించింది. (image: Indian Railways)