Restoration Of Daily Express Trains: హైదరాబాద్, విశాఖ, మచిలీపట్నం వాసులకు శుభవార్త.. ఈ ఎక్స్ప్రెస్ రైళ్ల పునరుద్ధరణ.. తేదీలు, టైమింగ్స్ ఇవే..
Restoration Of Daily Express Trains: హైదరాబాద్, విశాఖ, మచిలీపట్నం వాసులకు శుభవార్త.. ఈ ఎక్స్ప్రెస్ రైళ్ల పునరుద్ధరణ.. తేదీలు, టైమింగ్స్ ఇవే..
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు డైలీ ఎక్స్ ప్రెస్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (ఫొటో: ట్విట్టర్)
2/ 6
Train No.17030 (Old No.57130): హైదరాబాద్-బీజాపూర్ ట్రైన్ ను ఈ నెల 14 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ 21.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08:05 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Train No.17029 (Old No.57129): బీజాపూర్-హైదరాబాద్ ట్రైన్ ను ఈ నెల 16 నుంచి తిరిగి నడపనున్నారు. ఈ ట్రైన్ 18.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08.10 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
Train No.17219(Old No.57229): మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ఈ నెల 14 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 21.25 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 08:00 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
Train No.17220 (Old No.57230): విశాఖపట్నం-మచిలీపట్నం ట్రైన్ ను ఈ నెల 15 నుంచి నడపనున్నారు. ఈ ట్రైన్ 22.10 గంటలకు బయలుదేరి.. ముసటి రోజు 9:00 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగిం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.(ప్రతీకాత్మక చిత్రం)