తెలంగాణ, ఏపీ ప్రజలను చాలా రోజులుగా ఊరిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సేవలు సంక్రాంతి కానుకగా రేపు అంటే.. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సికింద్రాబాద్ - విశాఖపుంట్నం మధ్య నడిచే ఈ ట్రైన్ ను ప్రధాని మోదీ ఆదివారం రోజు ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. (ఫొటో: ట్విట్టర్)
ముందుగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ ట్రైన్ ను ఈ నెల 19న ప్రారంభించాల్సి ఉంది. అయితే.. సంక్రాంతి పండగ కానుకగా నాలుగు రోజులు ముందుగానే ప్రారంభిస్తున్నారు. తాజాగా ఈ ట్రైన్ కు సంబంధించిన టైం టేబుల్ ను విడుదల చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఈ నెల 15న (ఆదివారం) ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది.(ఫొటో: ట్విట్టర్)
తొలిరోజు చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. రాత్రి 8.45 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది.(ఫొటో: ట్విట్టర్)