South Central Railways: ఏసుప్రభు భక్తులకు ఇండియన్ రైల్వే శుభవార్త.. ఆ ఉత్సవాలకు వెళ్లేందుకు ప్రత్యేక సదుపాయం.. వివరాలివే
South Central Railways: ఏసుప్రభు భక్తులకు ఇండియన్ రైల్వే శుభవార్త.. ఆ ఉత్సవాలకు వెళ్లేందుకు ప్రత్యేక సదుపాయం.. వివరాలివే
ఏసుప్రభు భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ధరూర్ లో నిర్వహించనున్న ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ధారూరు మెథడిస్టు క్రిస్టియన్ జాతర సందర్భంగా ధరూర్ లో పలు ట్రైన్లకు స్టాపేజ్ సదుపాయాన్ని కల్పించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆ రైళ్లు నిమిషం పాటు ధరూర్ లో ఆగుతాయి.
Train No.16583: యశ్వంతపూర్-లాతూర్ ట్రైన్ ను ఈ నెల 18, 19 తేదీల్లో ధారూర్ లో ఆగే సదుపాయాన్ని కల్పించారు. ఈ ట్రైన్ 05.54 గంటలకు ఆగి, 05:55 గంటలకు తిరిగి ప్రారంభం అవుతుంది.
2/ 8
Train No.16584: లాతూర్-యశ్వంతపూర్ ట్రైన్ ను ఈ నెల 19, 20 తేదీల్లో ధారూర్ లో ఆగుతుంది.
3/ 8
Train No.16571: యశ్వంతపూర్-బీదర్ ట్రైన్ కు ఈ నెల 17న లాతూర్ లో ఆగే సౌకర్యం కల్పించారు. ఈ ట్రైన్ 05:54 గంటలకు ధరూర్ చేరుకుని.. 05:55 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
4/ 8
Train No.16572: బీదర్-యశ్వంతపూర్ ట్రైన్ ఈ నెల 18వ తేదీన ధారూర్ లో ఆగుతుంది.
5/ 8
Train No.16593: బెంగళూరు-హెచ్.ఎస్.నాందేడ్ ట్రైన్ ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ధరూర్ లో ఆగుతుంది.
6/ 8
Train No.16594: హెచ్.ఎస్.నాందేడ్-బెంగళూరు ట్రైన్ ఈ నెల 18 నుంచి 20 వరకు ఆగుతుంది. ఈ ట్రైన్ 14.24 గంటలకు ధరూర్ చేరుకుని.. 14.25 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
7/ 8
Train No.17663: తాండూరు-పర్భాణి ట్రైన్ ను ఈ నెల 18 నుంచి 20 తేదీ వరకు ధరూర్ లో ఆగుతుంది. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో 19.54 గంటలకు ఆగి.. 19.55 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
8/ 8
Train No.17664: పర్భాణి-తాండూరు ట్రైన్ ను ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు ధరూర్ లో ఆగుతుంది. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో 07.06 గంటలకు ఆగి.. మళ్లీ ధరూర్ లో 07.07 గంటలకు బయలుదేరుతుంది.