1. రైలు నెంబర్ 07483 కాచిగూడ నుంచి తిరుపతికి నవంబర్ 4న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శుక్రవారం రాత్రి 7.25 గంటలకు కాచిగూడలో బయల్దేరి శనివారం ఉదయం 8.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో మల్కాజ్గిరి, మౌలాలి గేట్, పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, గూడూరు జంక్షన్, రేణిగుంట జంక్షన్లో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 07484 తిరుపతి నుంచి కాచిగూడకు నవంబర్ 5న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో బయల్దేరి ఆదివారం తెల్లవారుజామున 4.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు జారిలో రేణిగుంట జంక్షన్, గూడూరు జంక్షన్, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి, మౌలాలి గేట్, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైలు నెంబర్ 02763 తిరుపతి నుంచి కాచిగూడకు నవంబర్ 3న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయల్దేరి శుక్రవారం తెల్లవారుజామున 5.20 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు జారిలో రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజిపేట్ జంక్షన్, జనగాం, మౌలాలి గేట్, మల్కాజ్గిరి స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇవే కాకుండా తిరుపతి రూట్లో మరిన్ని రైళ్లను పొడిగించింది రైల్వే. రైలు నెంబర్ 07095 మచిలీపట్నం నుంచి తిరుపతికి నవంబర్ 14 వరకు ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఇక రైలు నెంబర్ 07096 తిరుపతి నుంచి మచిలీపట్నం వరకు నవంబర్ 15 వరకు, సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రైలు నెంబర్ 02764 సికింద్రాబాద్ నుంచి తిరుపతి రూట్లో నవంబర్ 5న అందుబాటులో ఉంటుంది. శనివారం రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్లో రైలు బయల్దేరి, ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07451 తిరుపతి నుంచి శ్రీకాకుళం రూట్లో నవంబర్ 6న అందుబాటులో ఉంటుంది. ఆదివారం రాత్రి 8.10 గంటలకు తిరుపతిలో రైలు బయల్దేరి సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైలు నెంబర్ 07452 శ్రీకాకుళం నుంచి తిరుపతి రూట్లో నవంబర్ 7న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళంలో బయల్దేరి మంగళవారం ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07455 సికింద్రాబాద్ నుంచి తిరుపతి రూట్లో నవంబర్ 8న అందుబాటులో ఉంటుంది. మంగళవారం రాత్రి 8.05 గంటలకు సికింద్రాబాద్లో రైలు బయల్దేరి, బుధవారం ఉదయం 9 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇతర రూట్లల్లో కూడా రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే, రైలు నెంబర్ 07067 మచిలీపట్నం నుంచి కర్నూల్ సిటీ మధ్య నవంబర్ 29 వరకు శనివారం, మంగళవారం, గురువారం అందుబాటులో ఉంటుంది. ఇక రైలు నెంబర్ 07068 కర్నూల్ సిటీ నుంచి మచిలీపట్నం రూట్లో నవంబర్ 30 వరకు ఆదివారం, బుధవారం, శుక్రవారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)