1. భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు, పర్యాటకుల్ని ఆకట్టుకునే ప్రాజెక్టుల్ని కూడా చేపడుతోంది. అందులో భాగంగా ప్రధాన రైల్వే స్టేషన్లలో కోచ్ రెస్టారెంట్లను (Coach Restaurant) ప్రారంభిస్తోంది. దేశంలోని ఇతర రైల్వే స్టేషన్లలో పర్యాటకుల్ని ఆకర్షిస్తున్న కోచ్ రెస్టారెంట్ ఇప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్లో కూడా ప్రారంభం కావడం విశేషం. (image: South Central Railway)
2. గుంటూరు రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన కోచ్ రెస్టారెంట్ ఇది. గుంటూరు డివిజన్ రైల్వే అధికారులు స్లీపర్ కోచ్‌కు మార్పులు చేసి రెస్టారెంట్‌గా మార్చారు. ఈ రెస్టారెంట్‌ను రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రారంభించారు. కోచ్ రెస్టారెంట్ లోపల, బయట సుందరంగా తీర్చిదిద్దారు. (image: South Central Railway)
3. ఇప్పటి వరకు భారతీయ రైల్వే ఇతర రాష్ట్రాల్లోనే కోచ్ రెస్టారెంట్లను ప్రారంభించింది. తొలిసారిగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కోచ్ రెస్టారెంట్ గుంటూరులో ప్రారంభం కావడం విశేషం. రైల్వే ప్రయాణికులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా కోచ్ రెస్టారెంట్‌ను సందర్శించి ఫుడ్ ఆస్వాదించవచ్చు. (image: South Central Railway)
5. భారతీయ రైల్వే ఇప్పటికే అనేక రైల్వే స్టేషన్లలో కోచ్ రెస్టారెంట్లను ప్రారంభించింది. 'రెస్టారెంట్ ఆన్ వీల్స్' పేరుతో పలు రెస్టారెంట్స్ ఉన్నాయి. నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ ఆవరణలో స్వీట్స్ అండ్ స్నాక్స్ బ్రాండ్ అయిన హల్దీరామ్స్ ఈ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో కూడా 'రెస్టారెంట్ ఆన్ వీల్స్' పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. (image: South Central Railway)
6. పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్లో కూడా ఇలాంటి రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ల లోపల కూర్చొని కస్టమర్లు యాంబియన్స్‌ను ఎంజాయ్ చేస్తూ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు. రైలు లోపల యాంబియెన్స్, లైటింగ్ కూడా పర్యాటకుల్ని ఆకట్టుకుంటుంది. కస్టమర్లు ఎంత మంది కూర్చోవచ్చన్నది బోగీ సైజ్‌పై ఆధారపడి ఉంటుంది. (image: South Central Railway)