Special Train Alert: ప్రయాణికులకు అలర్ట్... మరో రెండు స్పెషల్ ట్రైన్స్‌ను పొడిగించిన రైల్వే
Special Train Alert: ప్రయాణికులకు అలర్ట్... మరో రెండు స్పెషల్ ట్రైన్స్‌ను పొడిగించిన రైల్వే
Special Train Alert | కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గడంతో భారతీయ రైల్వే కొత్త రైళ్లను ప్రకటిస్తోంది. ఇప్పటికే నడుపుతున్న ప్రత్యేక రైళ్లను పొడిగిస్తోంది. మరో రెండు స్పెషల్ ట్రైన్స్‌ని ఇంకొన్ని రోజులు పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
1. రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సికింద్రాబాద్-అగర్తలా రూట్లో నడిచే రెండు ప్రత్యేక రైళ్లను మరో రెండు వారాల పాటు పొడిగించింది రైల్వే. సికింద్రాబాద్-అగర్తలా రైలు 2021 జూలై 12 వరకు, అగర్తలా-సికింద్రాబాద్ రైలు 2021 జూలై 16 వరకు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. రైలు నెంబర్ 07030 సికింద్రాబాద్-అగర్తలా మధ్య ప్రతీ సోమవారం నడుస్తుంది. ఈ రైలు సోమవారం సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్లో బయల్దేరి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అగర్తలా చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. సికింద్రాబాద్-అగర్తలా స్పెషల్ ట్రైన్ గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఇక అగర్తలా-సికింద్రాబాద్ రైలు ప్రతీ శుక్రవారం నడుస్తుంది ఈ రైలు శుక్రవారం ఉదయం 6.10 గంటలకు అగర్తలాలో బయల్దేరి ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. ఈ రైలు శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. ఇక ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే మరో 28 రైళ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో పాత రైళ్లను పునరుద్ధరించడంతో పాటు ఇప్పటికే నడుపుతున్న కొన్ని స్పెషల్ ట్రైన్స్‌ను ఇంకొన్నాళ్లు పొడిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)