Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్, వైజాగ్, కాకినాడ, నిజామాబాద్, పూణే వెళ్లే ఈ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్, వైజాగ్, కాకినాడ, నిజామాబాద్, పూణే వెళ్లే ఈ రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. విజయవాడ డివిజన్ లో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా ఈ కింది రైళ్లను రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లు తెలిపింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంకా సెంట్రల్ రైల్వే (Central Railway) పరిధిలో ట్రాఫిక్ బ్లాక్ కారణంగా సైతం పలు రైళ్లను రద్దు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.17267: కాకినాడ పోర్ట్-విశాఖపట్నం ట్రైన్ ను ఈ నెల 26న రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
Train No.17268: విశాఖపట్నం-కాకినాడ పోర్ట్ ట్రైన్ ను ఈ నెల 26న అంటే రేపు (ఆదివారం) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాక్షికంగా రద్దు చేసిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
Train No.17258: కాకినాడ పోర్ట్-విజయవాడ: కాకినాడ పోర్టు-విజయవాడ ట్రైన్ ను ఈ నెల 26న కాకినాడ పోర్టు-రాజమండ్రి మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
Train No.17257: విజయవాడ-కాకినాడ ట్రైన్ ను ఈ నెల 26న రాజమండ్రి-కాకినాడ పోర్టు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
Train No.11409: దౌండ్-నిజామాబాద్ ట్రైన్ ను ఈ నెల 25 నుంచి 28 వరకు, Train No.11410: నిజామాబాద్-పూణే ట్రైన్ ను ఈ నెల 24 నుంచి 27 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇంకా.. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
Train No.17058: సికింద్రాబాద్-ముంబాయి సీఎస్టీ ట్రైన్ ను ఈ నెల 25 నుంచి 27 వరకు.. Train No.17057: ముంబాయి సీఎస్టీ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ ను 26 నుంచి 28 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
Train No.17058: సికింద్రాబాద్-ముంబాయి సీఎస్టీ ట్రైన్ ను ఈ నెల 25 నుంచి 27 వరకు.. Train No.17057: ముంబాయి సీఎస్టీ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ ను 26 నుంచి 28 వరకు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ఫొటో: ట్విట్టర్)