Secunderabad Trains Cancelled: సికింద్రాబాద్ లో విధ్వంసంతో భారీగా రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి లిస్ట్ ఇదే..
Secunderabad Trains Cancelled: సికింద్రాబాద్ లో విధ్వంసంతో భారీగా రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి లిస్ట్ ఇదే..
కేంద్రం తాజాగా ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి (Agnipath Scheme) వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో (Secunderabad Railway Station) ఈ రోజు జరిగిన విధ్యంసం కారణంగా దక్షిణ మధ్య రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. ఆ రైళ్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
1. Train No.12703/17234: హౌరా-సికింద్రాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ రైళ్లను మౌలాలి-సికింద్రాబాద్ మధ్య ఈ నెల 17 న రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. Train No.12747: గుంటూరు-వికారాబాద్ ట్రైన్ ను చర్లపల్లి-వికారాబాద్ మధ్య ఈ నెల 17 మధ్య రద్దు చేసింది. (ఫొటో: ట్విట్టర్)
2/ 10
2. Train No.17230: సికింద్రాబాద్-తిరువనంతపురం సెంట్రల్ ట్రైన్ ను ఈ రోజు అంటే జూన్ 17న పూర్తిగా రద్దు చేసింది. ఇంకా విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లను చర్లపల్లి సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 17న రద్దు చేశారు. (ఫొటో: ట్విట్టర్)
3/ 10
3. సికింద్రాబాద్-ఉమ్దా నగర్ మధ్య నడిచే పలు రైళ్లను ఈరోజు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇంకా షిరిడీ సాయి నగర్ తో పాటు పలు రైళ్లను దారి మళ్లించింది. (ఫొటో: ట్విట్టర్)
4/ 10
4. Train No.12704/Train No.12791: సికింద్రాబాద్-హౌరా, సికింద్రాబాద్ ధన్ పూర్ రైళ్లను ఈ నెల 17న రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇంకా వికారాబాద్-గుంటూరు ట్రైన్ సనత్ నగర్, చర్లపల్లి మీదుగా దారి మళ్లించింది. (ఫొటో: ట్విట్టర్)
5/ 10
5. Train No.17002: సికింద్రాబాద్-సాయినగర్ షిరిడీ ట్రైన్ ను ఈ నెల 17న రద్దు చేశారు అధికారులు. ట్రైన్ హైదరాబాద్-కర్నూల్ సిటీ ట్రైన్ ను ఈ నెల 17న దారి మళ్లించారు. (ఫొటో: ట్విట్టర్)
6/ 10
6. Train No.12792: ధన్ పూర్-సికింద్రాబాద్ ట్రైన్, Train No.22644: పాట్నా-ఎర్నాకులం ట్రైన్ ను ఈ నెల 17 న రద్దు చేశారు. (ఫొటో: ట్విట్టర్)
7/ 10
7. సికింద్రాబాద్-భువనేశ్వర్, హైదరాబాద్-కాజీపేట, కాజీపేట-సికింద్రాబాద్ తో పాటు మొత్తం 15 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ఫొటో: ట్విట్టర్)
8/ 10
8. Train No.12295: కేఎస్ఆర్ బెంగళూరు-ధన్ పూర్ ట్రైన్ ఈ నెల 17న రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ఫొటో: ట్విట్టర్)
9/ 10
9. Train No.12578: మైసూరు-ధర్భంగా ట్రైన్ ను ఈ నెల 17న పాక్షికంగా రద్దు చేశారు అధికారులు. (ఫొటో: ట్విట్టర్)
10/ 10
10. Train No.17010, Train No.17009: సికింద్రాబాద్-బీదర్, బీదర్-సికింద్రాబాద్ రైళ్లను ఈ నెల 17, 18 తేదీల్లో రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. (ఫొటో: ట్విట్టర్)