Trains Cancelled: పండగ పూట ప్రయాణికులకు షాక్.. ఈ 19 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
Trains Cancelled: పండగ పూట ప్రయాణికులకు షాక్.. ఈ 19 రైళ్లు రద్దు.. పూర్తి వివరాలివే..
సంక్రాంతి పూట ప్రయాణికులకు భారీ షాకిచ్చింది దక్షిణ మధ్య రైల్వే. మొత్తం 19 ఎంఎంటీఎస్ రైళ్లను ఈ నెల 13, 14 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిర్వహణ కారణాలతో ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
లింగంపల్లి-హైదరాబాద్: ఈ మార్గంలో 47135, 47137 నంబర్ గల ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో మొత్తం 3 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మార్గంలో 47110, 47111, 471119 నంబర్ గల రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఫలక్ నూమా-లింగంపల్లి మార్గంలో ఐదు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు అయ్యాయి. 47160, 47156, 47158, 47214, 47216 నంబర్ గల రైళ్లు ఈ మార్గంలో రద్దు అయ్యాయి. (ఫొటో: ట్విట్టర్)
4/ 7
లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో మొత్తం 6 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు అయ్యాయి. 47181, 47186, 47212, 47183, 47185, 47217 నంబర్ గల రైళ్లను ఈ మార్గంలో రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
రామచంద్రాపురం-ఫలక్ నూమా మార్గంలో 47177 నంబర్ గల ఎంఎంటీఎస్ సర్వీసును రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఫలక్ నూమా-రామచంద్రాపురం మధ్య 47218, ఫలక్ నూమా-హైదరాబాద్ మధ్య 47201 నంబర్ గల సర్వీసును రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
ఈ రైళ్ల రద్దుతో సొంతూళ్లకు వెళ్లడానికి హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, లింగంపల్లి స్టేషన్లకు వెళ్లే వారికి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. (ఫొటో: ట్విట్టర్)