దక్షిణ మధ్య రైల్వేలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. భారీగా ట్రైన్ ఆపరేటర్లతో పాటు ఇతర సిబ్బంది కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అధికారులు భారీగా రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 21 నుంచి 24 వరకు దాదాపు 55 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.(ప్రతీకాత్మక చిత్రం)
గతంలో కరోనా ప్రారంభంలో, సెకండ్ వేవ్ సమయంలోనూ అధికారులు భారీగా రైళ్లను రద్దు చేశారు. దీంతో రైల్వే భారీగా నష్టాలను మూటగట్టుకుంది. అయితే కేసుల సంఖ్య భారీగా పడిపోవడంతో దాదాపు అన్ని రైళ్లను అధికారులు తిరిగి ప్రారంభించారు. ఈ సంక్రాంతి సమయంలోనూ భారీగా ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించారు. అయితే, మళ్లీ కరోనా దేశ వ్యాప్తంగా విజృంభించడంతో భారీగా రైళ్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.(ప్రతీకాత్మక చిత్రం)
అయితే.. ఉత్తర భారతదేశంలోనూ ప్రతికూల వాతావరణం పరిస్థితులు, భారీగా కరోనా కేసుల నేపథ్యంలో ఇండియన్ రైల్వే భారీగా రైళ్లను రద్దు చేసింది. మంగళవారం దాదాపు 350 రైళ్లను రద్దు చేసింది. బుధవారం కూడా దాదాపు 400 రైళ్లను రద్దు చేసింది. దీంతో పాటు గురువారం బయల్దేరాల్సిన 282 రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. మరో 35 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)