SOUTH CENTRAL RAILWAY ANNOUNCEMENT OVER CANCELLATION PARTIAL CANCELLATION AND DIVERSION OF TRAINS DUE TO TRAFFIC BLOCK NS
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు.. వివరాలివే
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను పాక్షకంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా.. మరికొన్నింటినీ పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
2/ 5
Train No.06746: నెల్లూరు - సుల్లూరుపేట మెమూ, Train No.06745: సుల్లూరుపేట-నెల్లూరు మెమూ రైళ్లను ఈ నెల 24న రద్దు చేస్తున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే.
3/ 5
Train No.16054: తిరుపతి-చెన్నైసెంట్రల్, Train No.16053: చెన్నై సెంట్రల్-తిరుపతి ట్రైన్లను ఈ మే 17, 18, 24, 26, 31 జూన్ 1, 7, 8 తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
4/ 5
Train No.12711: విజయవాడ-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ - విజయవాడ రైళ్లను ఈ నెల 24న గూడూరు-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-గూడూరు మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
5/ 5
ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.