1. రైలు నెంబర్ 07297 కాచిగూడ నుంచి తిరుపతికి (Kacheguda to Tirupati) మే 18న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం రాత్రి 10.20 గంటలకు కాచిగూడలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. దారిలో ఉందానగర్ (శంషాబాద్), షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లో ఈ రైలు ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 07298 తిరుపతి నుంచి కాచిగూడకు (Tirupati to Kacheguda) మే 19న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. దారిలో రేణిగుంట, రాజంపేట్, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, ఢోన్, కర్నూల్ సిటీ, గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, ఉందానగర్ (శంషాబాద్) రైల్వే స్టేషన్లో ఈ రైలు ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. హైదరాబాద్-తిరుపతి రూట్లో నడిచే సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ రిజర్వేషన్ ప్రారంభమైంది. ఐఆర్సీటీసీ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లో రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఫస్ట్ ఏసీ, ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. మే 18, 19 కోసం మాత్రమే ఈ రైళ్లను ప్రకటించింది. రద్దీ కొనసాగితే ఈ రైళ్లను కొనసాగించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇవే కాదు... దేశంలోని వేర్వేరు రూట్ల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే. ఇప్పటికే నార్త్ వెస్టర్న్ రైల్వే తిరుపతి రూట్లో సమ్మర్ సూపర్‌ఫాస్ట్ వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రైళ్లు జైపూర్ నుంచి తిరుపతి రూట్లో అందుబాటులో ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు వెళ్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. రైలు నెంబర్ 09715 జైపూర్ నుంచి తిరుపతి మధ్య మే 21, 28 తేదీల్లో, రైలు నెంబర్ 09716 తిరుపతి నుంచి జైపూర్ మధ్య మే 24, 31 తేదీల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లు దారిలో తెలుగు రాష్ట్రాల్లో రేణిగుంట జంక్షన్, గూడూరు జంక్షన్, నెల్లూరు, విజయవాడ జంక్షన్, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి తిరుపతి రూట్లో పలు రైళ్లను నడుపుతోంది. రైలు నెంబర్ 02764 సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మే 21, 28 తేదీల్లో, రైలు నెంబర్ 02763 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు మే 22, 29 తేదీల్లో, రైలు నెంబర్ 07646 చిత్తూరు నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు ప్రతీ ఆదివారం జూన్ 26 వరకు, రైలు నెంబర్ 07645 శ్రీకాకుళం రోడ్, విశాఖపట్నం, విజయవాడ నుంచి చిత్తూరు వరకు ప్రతీ ఆదివారం జూన్ 27 వరకు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)