1. రైలు నెంబర్ 07082 హెచ్ఎస్ నాందేడ్ నుంచి విశాఖపట్నం (Nanded Visakhapatnam Train) మధ్య అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 8న సాయంత్రం 4.35 గంటలకు హెచ్ఎస్ నాందేడ్‌లో బయల్దేరిన రైలు మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు దారిలో ముద్ఖేడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, కాజిపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 07083 విశాఖపట్నం నుంచి హెచ్ఎస్ నాందేడ్ మధ్య అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఏప్రిల్ 10న సాయంత్రం 6.20 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు హెచ్ఎస్ నాందేడ్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజిపేట్, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైలు నెంబర్ 06595 బెంగళూరు సిటీ నుంచి ధర్మవరం రూట్లో నడుస్తోంది. ఈ రైలు ఉదయం 8.25 గంటలకు బెంగళూరు సిటీలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లో దేవరపల్లి, హిందూపూర్, మలుగూర్, పెనుకొండ, నారాయణపురం, సత్యసాయి నిలయం, కట్లిచెర, బాసంపల్లి, ధర్మవరం జంక్షన్లో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రైలు నెంబర్ 06596 ధర్మవరం నుంచి బెంగళూరు సిటీ రూట్లో నడుస్తోంది. ఈ రైలు మధ్యాహ్నం 1.15 గంటలకు ధర్మవరంలో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.00 గంటలకు బెంగళూరు సిటీ చేరుకుంటుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లో ధర్మవరం జంక్షన్, బాసంపల్లి, కట్లిచెర, సత్యసాయి నిలయం, నారాయణపురం, పెనుకొండ, మలుగూర్, హిందూపూర్, దేవరపల్లిలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక ఇప్పటికే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రైలు నెంబర్ 07597 సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య, రైలు నెంబర్ 07596 తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య, రైలు నెంబర్ 06223 శివమొగ్గ నుంచి చెన్నై సెంట్రల్ మధ్య, రైలు నెంబర్ 06224 చెన్నై సెంట్రల్ నుంచి శివమొగ్గకు ప్రకటంచింది. (ప్రతీకాత్మక చిత్రం)