Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-తిరుపతితో పాటు అక్కడికి స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే..
Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-తిరుపతితో పాటు అక్కడికి స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే..
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్ట్యా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్ట్యా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
Train No.07489: సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 17, 24, 31 తేదీల్లో (శుక్రవారం) నడపనున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
Train No.07490: తిరుపతి-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో (ఆదివారం) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
ఈ రైళ్లకు గతంలోని స్టాపేజ్ లు, టైమింగ్స్ కొనసాగుతాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలో స్పష్టం చేసింది. (ఫొటో: ట్విట్టర్)
5/ 8
Train No.03226: సికింద్రాబాద్-ధన్ పూర్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ట్రైన్ 10.00 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 19.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
Train No.03225: ధన్ పూర్-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 16, 23 తేదీల్లో నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 20.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 04.40 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
ఈ పై రెండు రైళ్లు కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బలర్షా, నాగపూర్, జబల్ పూర్, మణిక్ పూర్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్ లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. (ఫొటో: ట్విట్టర్)