1. సికింద్రాబాద్-తిరుపతి రూట్లో (Secunderabad Tirupati Train) రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. రైలు నెంబర్ 07597 సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు 2022 ఏప్రిల్ 8 రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు దారిలో నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 07596 తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలు 2022 ఏప్రిల్ 10 రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. వీటితో పాటు శివమొగ్గ-చెన్నైసెంట్రల్ రూట్లో బైవీక్లీ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్‌లోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తాయి. రైలు నెంబర్ 06223 శివమొగ్గ నుంచి చెన్నై సెంట్రల్‌కు 2022 ఏప్రిల్ 17 నుంచి 2022 జూన్ 28 మధ్య ప్రతీ ఆదివారం, మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు దారిలో భద్రావతి, తరికెరి, బిరూర్, అజ్జంపుర, హోసదుర్గ రోడ్, చిక్జజూర్, చిత్రదుర్గ, చల్లకేరి, మోలకలమూరు, రాయదుర్గం, బళ్లారి, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, అరక్కోణం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైలు నెంబర్ 06224 చెన్నై సెంట్రల్ నుంచి శివమొగ్గకు 2022 ఏప్రిల్ 18 నుంచి 2022 జూన్ 29 మధ్య ప్రతీ సోమవారం, బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు దారిలో అరక్కోణం, రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్, బళ్లారి, రాయదుర్గం, మోలకలమూరు, చల్లకేరి, చిత్రదుర్గ, చిక్జజూర్, హోసదుర్గ రోడ్, అజ్జంపుర, బిరూర్, తరికెరి, భద్రావతి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇవే కాకుండా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. మచిలీపట్నం-తిరుపతి రూట్లో 98 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది రైల్వే. రైలు నెంబర్ 07095 మచిలీపట్నం నుంచి తిరుపతి రూట్లో, రైలు నెంబర్ 07096 తిరుపతి నుంచి మచిలీపట్నం రూట్లో అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక ఎర్నాకుళం-బరౌనీ రూట్లో నడుస్తున్న రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. మరో 16 వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. రైలు నెంబర్ 06522 ఎర్నాకుళం జంక్షన్ నుంచి బరౌనీ మధ్య ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. రైలు నెంబర్ 06521 బరౌనీ నుంచి ఎర్నాకుళం జంక్షన్ మధ్య ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-సాయినగర్ షిరిడీ రూట్లో నడిచే రైళ్ల టైమింగ్స్ మార్చింది దక్షిణ మధ్య రైల్వే. రైలు నెంబర్ 22601 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్లో బుధవారం ఉదయం 10.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11.25 గంటలకు సాయినగర్ షిరిడీ చేరుకుంటుంది. రైలు నెంబర్ 22602 సాయినగర్ షిరిడీలో శుక్రవారం ఉదయం 8.25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు సాయినగర్ షిరిడీ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)