Sabarimala Special Trains: శబరిమల వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. మొత్తం 4 స్పెషల్ ట్రైన్లు.. ఏ తేదీల్లో అంటే..
Sabarimala Special Trains: శబరిమల వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. మొత్తం 4 స్పెషల్ ట్రైన్లు.. ఏ తేదీల్లో అంటే..
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శబరిమలకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. 4 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07119: నర్సాపూర్-కొట్టాయం మధ్య ఈ నెల 18, 25 తేదీల్లో స్పెషల్ ట్రైన్లను ప్రకటించిది. ఈ రైళ్లు 05:00 గంటలకు బయలుదేరి.. మరుసటి 03:50 గంటలకు గమ్యానికి చేరుతుంది.
2/ 12
Train No.07120: కొట్టాయం-నర్సాపూర్ మధ్య 19, 26 తేదీల్లో స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఈ ట్రైన్లు ఆయా రోజుల్లో 10.50 గంటలకు బయలుదేరి.. 16.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది.
3/ 12
ఈ రైళ్లు పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, సేలం, ఆలువ, ఎర్నాకులం స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు.
4/ 12
ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. శబరిమల వెళ్లే ప్రయాణికులు పూర్తి సమాచారం కోసం పై అధికారిక ప్రకటనను చూడొచ్చు. (ఫొటో: ట్విట్టర్)
5/ 12
Train No.07420: తిరుపతి-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 10న నడపనున్నారు. ఈ ట్రైన్ 21.10 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09:30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 12
ఈ ట్రైన్ రేణిగుంట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, మంత్రాలయం, రాయిచూర్, సులేహల్లి, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 12
Train No.07569: సికింద్రాబాద్-పూరీ ట్రైన్ ను ఈ నెల 11, 18, 25 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో 20.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు 17.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 12
Train No.07570: పూరీ-సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 12, 19, 26 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ 22.45 గంటలకు బయలుదేరి.. 20.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 12
ఈ ట్రైన్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బెర్హంపూర్ తదితర స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 12
Train No.04121: సుబేదర్ గంజ్-సికింద్రాబాద్ ట్రైన్ ను డిసెంబర్ 8 నుంచి జనవరి 26 వరకు నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో 15.50 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 20.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 12
Train No 04122: సికింద్రాబాద్-సుబేదర్ గంజ్ ట్రైన్లు డిసెంబర్ 9 నుంచి జనవరి 27 వరకు నడపనున్నారు. ఈ ట్రైన్ 21.50 గంటలకు బయలుదేరి.. రెండో రోజు 4.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 12
ఈ రైళ్లు ఖాన్ పూర్, ఒరాయి, భోపాల్, నాగ్ పూర్, సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట్ స్టేషన్లలో ఆగుతాయి. (ఫొటో: ట్విట్టర్)