Tirupati Special Trains: తిరుపతి-కాచిగూడ మధ్య వీకెండ్స్ లో 5 స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే..
Tirupati Special Trains: తిరుపతి-కాచిగూడ మధ్య వీకెండ్స్ లో 5 స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే..
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ-తిరుపతి మధ్య పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07473: కాచిగూడ-తిరుపతి మధ్య మొత్తం ఐదు స్పెషల్ ట్రైన్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైళ్లు డిసెంబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఈ రైళ్లు ఆయా తేదీల్లో అంటే వచ్చే నెలలోని ప్రతీ శుక్రవారం 17.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07.20 గంటలకు గమ్యానికి చేరుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Train No.07474: తిరుపతి-కాచిగూడ మధ్య మొత్తం ఐదు ట్రైన్టను నడపనున్నారు. ఈ ట్రైన్లను 3, 10, 17, 24, 31 తేదీల్లో నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
ఈ ట్రైన్లు ఆయా తేదీల్లో అంటే ప్రతీ శనివారం 19.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఆదివారం 09.10 గంటలకు గమ్యానికి చేరుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఈ పది రైళ్లు మల్కాజ్ గిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తదితర స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. (ఫొటో: ట్విట్టర్)