1. రైలు నెంబర్ 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు 2022 జనవరి 5 నుంచి జనవరి 26 వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విశాఖపట్నంలో రాత్రి 7 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దారిలో దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లి, మిర్యాలగూడ, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రైలు నెంబర్ 08580 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 2022 జనవరి 6 నుంచి జనవరి 27 వరకు ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ జంక్షన్లో రాత్రి 7.40 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు దారిలో మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైలు నెంబర్ 08585 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు 2022 జనవరి 4 నుంచి జనవరి 25 వరకు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 5.35 గంటలకు విశాఖపట్నం జంక్షన్లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 7.10 గంటకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఈ రైలు దారిలో దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైలు నెంబర్ 08586 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు 2022 జనవరి 5 నుంచి జనవరి 26 వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు దారిలో నల్గొండ,మిర్యాలగూడ, గుంటూరు జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక ఇప్పటికే దక్షిణ మధ్యరైల్వే మరిన్ని సంక్రాంతి రైళ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. రైలు నెంబర్ 07067 మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ వరకు ప్రతీ శనివారం, మంగళవారం, గురువారం, రైలు నెంబర్ 07068 కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నం వరకు ప్రతీ ఆదివారం, బుధవారం, శుక్రవారం, రైలు నెంబర్ 07455 నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. రైలు నెంబర్ 07456 సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య ప్రతీ సోమవారం, రైలు నెంబర్ 07577 మచిలీపట్నం నుంచి కాజీపేట్ మీదుగా సికింద్రాబాద్ వరకు ప్రతీ ఆదివారం, రైలు నెంబర్ 07578 సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా మచిలీపట్నం వరకు ప్రతీ ఆదివారం, రైలు నెంబర్ 07605 తిరుపతి నుంచి అకోలా వరకు ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. రైలు నెంబర్ 07606 అకోలా నుంచి తిరుపతి వరకు ప్రతీ ఆదివారం, రైలు నెంబర్ 07607 పూర్ణ నుంచి తిరుపతి వరకు ప్రతీ సోమవారం, రైలు నెంబర్ 07608 తిరుపతి నుంచి పూర్ణ వరకు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటాయి. గతంలో ప్రకటించిన సంక్రాంతి ప్రత్యేక రైళ్లతో పాటు ప్రస్తుతం ప్రకటించిన రైళ్లకు టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. (ప్రతీకాత్మక చిత్రం)