SOUTH CENTRAL RAILWAY ANNOUNCED CANCELLATION OF MMTS TRAIN SERVICES HERE DETAILS NS
Cancellation of MMTS Train Services: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. 34 సర్వీసులు రద్దు.. పూర్తి వివరాలివే
దక్షిణ మధ్య రైల్వే రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 21, 22 తేదీల్లో 34 ఎంఎంటీఎస్ రైళ్లను (MMTS Trains) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 9 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల రైళ్లను రద్దు చేశారు అధికారులు.
2/ 5
ఇంకా హైదరాబాద్ నుంచి లింగపల్లి వరకు నడిచే 9 సర్వీసులను సైతం రద్దు చేశారు. 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబర్ గల రైళ్లు ఈ మార్గంలో రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
3/ 5
ఫలక్ నూమా-లింగంపల్లి వరకు నడిచే 7 సర్వీసులను రద్దు చేశారు. 47153, 47164, 47165, 47166, 47103, 47220, 47170 నంబర్ గల సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
4/ 5
లింగంపల్లి-ఫలక్ నూమా మార్గంలో 7 సర్వీసులను రద్దు రద్దు చేశారు. 47176, 47189, 47210, 47187, 47190, 47192 నంబర్ గల రైళ్లు రద్దు అయ్యాయి.
5/ 5
సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 47150 నంబర్ గల సర్వీసును రద్దు చేశారు. ఇంకా లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో 47195 నంబర్ గల సర్వీసును రద్దు చేశారు అధికారులు. (ఫొటో: ట్విట్టర్)