Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ప్రాంతాల మధ్య 8 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే
Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ప్రాంతాల మధ్య 8 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) మరో శుభవార్త చెప్పింది. నాందేడ్-యశ్వంతపూర్ మధ్య 8 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. నాందేడ్-యశ్వంతపూర్ మధ్య భారీగా స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
Train No.07093: నాందేడ్-యశ్వంతపూర్ మధ్య ఈ నెల 5, 12, 19, 26 తేదీల్లో స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
Train No.07094: యశ్వంతపూర్-నాందేడ్ మధ్య డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో స్పెషల్ ట్రైన్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
ఈ రెండు రైళ్లు పూర్ణ, పర్భాణి, బీదర్, వాడీ, రాయిచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, యల్హంక స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
ఇంకా ఈ రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు. (ఫొటో: ట్విట్టర్)
6/ 10
ఇంకా.. Train No.07414: జాల్నా-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను డిసెంబర్ 11, 18, 25, జనవరి 1వ తేదీల్లో నడపనున్నట్లు తెలిపింది. ఈ రైళ్లు ప్రతీ ఆదివారం నడుపుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
Train No.07413: తిరుపతి-జాల్నా స్పెషల్ ట్రైన్లను డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ను ప్రతీ మంగళవారం నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
Train No.07651: జాల్నా-ఛప్రా ట్రైన్ ను డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 10
Train No.07652: ఛప్రా-జల్నా ట్రైన్ ను డిసెంబర్ 9, 16, 23, 30 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ట్రైన్ ను శుక్రవారం నడపనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 10
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్పెషల్ ట్రైన్లను పైన పేర్కొన్న తేదీల్లో నడపడానికి పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. (ఫొటో: ట్విట్టర్)